Telugu News

మహా పూజ తో నాగోబా జాతర ప్రారంభం.

కోనేరు నుంచి కుండలో నీళ్లు

0

మహా పూజ తో నాగోబా జాతర ప్రారంభం
-కోనేరు నుంచి కుండలో నీళ్లు
తీసుకెళ్తున్న మహిళలు
(ఇంద్రవెల్లి మండలం న్యూస్) :-

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఆదివాసీల నాగోబా జాతర మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మేస్రం వెంకటేష్ ఆధ్వర్యంలో సాంప్రదాయాల పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంట పాటు మేస్రం వంశస్థులు సమక్షంలో పుజలు జరిగాయి. సాంప్రదాయం ప్రకారం మర్రిచెట్టు నీడ నా మెస్రం వంశస్థులు సేదదిరారు. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతరగా పేరుపొందిన ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మండల గాజిలు పూజ ప్రారంభించారు. రేపటి రోజున బేతల్ పూజ నిర్వహించనున్నారు

also read;-యువత జీవిత లక్ష్యం సాధించాలి:ఎసిపి.

మహా పూజకు ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్, ఎమ్మెల్సీ దండ విట్టల్, జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులపై మేస్రం వంశస్థులు పవిత్ర జలాలను చల్లారు అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్ వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి తీసుకొని వచ్చారు. మెస్రం వంశ ఆడపడుచులు ఆలయ ఆవరణలో మట్టితో పుట్టలు తయారు చేశారు. ఆస్తినామడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు ఆలయానికి శుద్ధి చేశారు. నాగబాబు విగ్రహానికి అభిషేకం చేసి మహాపూజ చేసి జాతర ప్రారంభించారు. తర్వాత గిరిజనులు ప్రజా ప్రతినిధులు భక్తులు నాగోబాని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రెండవ రోజే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి కొత్త కోడలు బేటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తర్వాత వారిని మేస్రం వంశీయులు గా ప్రకటిస్తారు.