Telugu News

ఈదులపూసపల్లి వెంచర్లో చిత్రవిచిత్రాలు…!

వాగును మింగి.. గ్రీన్ ల్యాండ్ గా చూపారు..

0

ఈదులపూసపల్లి వెంచర్లో చిత్రవిచిత్రాలు…!

== వాగును మింగి.. గ్రీన్ ల్యాండ్ గా చూపారు..

మహబూబాబాద్ జులై 16 (విజయం న్యూస్)

మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గల ఈదులపూసపల్లి కేసముద్రం గ్రామాల మధ్య ఉన్న రాళ్ల వాగును రియల్టర్లు దర్జాగా కబ్జా చేశారు. ఈదులపూసపల్లి గ్రామ చెరువు నుండి మున్నేరు వాగుకు అనుసంధానంగా ఉన్న రాళ్ల వాగు చుట్టూ వెంచర్‌లు చేశారు. మున్సిపాలిటీ‌గా ఉన్న మానుకోట జిల్లా కేంద్రం కావడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని విజయవాడ జిల్లాకు చెందిన రియల్టర్లు మానుకోటలో రియల్ వ్యాపారం చేస్తున్నారు. రాళ్ల వాగుకు ఇరు వైపుల వెంచర్‌లు చేసి కబ్జా చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లే వాగులో మట్టిని పోసి చదును చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ALLSO READ- రోడ్డు మార్గంగానే భద్రాచలానికి సీఎం

== ఎన్ ఓసీ ఇచ్చిన అధికారులు..

రాళ్లవాగుకు ఇరు వైపుల ఉన్న వెంచర్ల పై సైట్ విజిట్ చేయకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్.ఓ.సీ) ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయా వెంచర్ నిర్వాహకులు వాగును కబ్జా చేయడం మూలంగా వాగు స్థిరీకరణ కాకుండా భిన్నంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బాధిత రైతుల పంట పొలాలు నీట మునిగిపోతున్నాయని వాపోతున్నారు. పలు శాఖ అధికారులు అమ్యామ్యలతో అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

== గ్రీన్ ల్యాండ్‌గా ప్రభుత్వ భూమే..

వెంచర్ నిబంధనల ప్రకారం గ్రీన్ ల్యాండ్ ఇవ్వాల్సి ఉండగా రాళ్ల వాగు శివారులో ఉన్న భూమి నే గ్రీన్ ల్యాండ్‌గా ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా గ్రీన్ ల్యాండ్ తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ భూమినే రియ‌ల్టర్లు గ్రీన్‌ల్యాండ్ కింద చూప‌డం గ‌మ‌నార్హం. మానుకోట కబ్జాలకు మారు పేరుగా నిలుస్తుంది. ప్రభుత్వ భూమి, వాగు భూమి, అసైన్డ్ భూమి అని తేడా లేకుండా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతూ.. కోట్ల రూపాయలు కొల్లగొడతున్నారాడంలో అతియోశక్తి లేదు. ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి నే టార్గెట్ చేస్తూ.. కబ్జా దారులు కబ్జాలకు పాల్పడుతున్నారు. చెరువు శిఖం, ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ పరిధిలో కూడా అక్రమ వెంచర్‌లు చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారనే ఆరోపణల వినవస్తున్నాయి.

ALLSO READ- భద్రాచలంలో నేడు గవర్నర్ పర్యటన