Telugu News

ఈ వాగు దాటేదెలా…?

జిన్నెల వాగు దాటనిదే కనీస అవసరాలు తీరవు

0

ఈ వాగు దాటేదెలా…?

*వర్షాకాలం వస్తే ప్రజల్లో భయం,భయం

*జిన్నెల వాగు దాటనిదే కనీస అవసరాలు తీరవు

*విద్యార్థులకు సైతం తప్పని తిప్పలు

మహబూబాబాద్ ప్రతినిధి జులై 23 (విజయం న్యూస్)

ప్రభుత్వాలు మారాయి,పాలకులు మారారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది.పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి వరంగల్ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిదింది చిన్న గ్రామాలను గ్రామపంచాయితీలుగా చేశారు.
జిల్లా కేంద్రానికి సుమారు కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఆ గ్రామం. మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆ గ్రామం పేరు ఒకప్పుడు చిన్నగూడూరు లో నుంచి ఇప్పుడు పగిడిపల్లి నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది.

ALLSO READ- ఖమ్మంలో రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

ఇక్కడి ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా చిన్న గూడూరు మండల కేంద్రానికి రావాల్సిందే కనీసం ప్రాధమిక పాఠశాల విద్య కోసం పిల్లలు కూడా ఇక్కడనుంచి మండల కేంద్రం అయిన చిన్న గూడూరుకి రావాల్సిందే మరి చిన్న గూడూరు నుంచి పగిడిపల్లి మధ్య వర్షాకాలం వచ్చిందంటే జిన్నెల వాగు ఉంది. కానీ ప్రజలు వాగు దాటనిదే కనీస అవసరాలు తీరవు,విద్యార్థులకు సైతం తప్పని తిప్పలు, పాలకులు చూపించే సవతి తల్లి ప్రేమతో మండల కేంద్రానికి అతి సమీపంలో ఉండే జిన్నెల వాగుపై చిన్న వంతెన లేక వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉగ్రరూపం దాల్చటం తో చిన్న గూడూరు నుంచి పగిడిపల్లి, గుండం రాజు పల్లి,బాబొజి తండా,లకు పూర్తిగా రాక పోకలు నిలిచి పోతాయి. ఇక్కడ వంతెన నిర్మాణం ఆయా గ్రామాల ప్రజల యొక్క దశాబ్ధాల నాటి కల కానీ నేటికీ నెరవేరలేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే మనం అడవుల్లో ఉన్నామా లేక ఏదైనా ప్రత్యేక దీవి లో ఉన్నామా అనే విధంగా నాగరిక సమాజం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కనీసం ప్రజలు తమతమ అవసరాలకు మండల కేంద్రానికి వెళ్ళటానికి ఒక వంతెన కట్టలేని ప్రభుత్వాలు ప్రజలకు ఏమి సమాధానం చెప్పగలవు అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చిన్న గూడూరు,పగిడిపల్లి మధ్య జిన్నెల వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ALLSO READ- పొంగిపోర్లుతున్న పాలేరు జలాశయం