Telugu News

ఠాగూర్ సినిమాను మరిపించిన మహుబాద్ వైద్యులు

ఏరియా ఆసుపత్రిలో వ్యక్తి మృతి

0

ఠాగూర్ సినిమాను మరిపించిన మహుబాద్ వైద్యులు

== మహబూబూబాద్ ఏరియా ఆసుపత్రిలో వ్యక్తి మృతి

(రిపోర్టర్: గడిపల్లి శ్రీనివాస్)

మహబూబాబాద్ ప్రతినిధి జులై 28 (విజయం న్యూస్)

మహబూబూబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి మధ్యాహ్నం ఒంటి గంటకు వైద్యులు డిశ్చార్జ్ చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజ్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్య దేవి పల్లి గ్రామానికి చెందిన ఏర్పుల యాకయ్య(38) ఈ నెల 22 వ తేదీన ఆరోగ్యం బాగా లేదని హాస్పిటల్‌కు నడుచుకుంటూ.. వచ్చి అడ్మిట్ అయినట్లు తెలిపారు. సరిగ్గా 10 రోజుల నుండి చికిత్స చేస్తున్నారని ఆరోపించారు. గురువారం 11.30 గంటలకు చనిపోయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఒక్క వైద్యుడు కూడా రాలేదని ఆరోపించారు.

allso read- నాడు..నేడు అదే గోస.. గిరిజనుల అరిగోస
సరిగ్గా ఒంటి గంటకు డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి డిశ్చార్జ్ చేయాలని, ఇతర హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని తెలిపినట్లు మృతుని భార్య రాధిక తెలిపింది. చనిపోయిన వ్యక్తికి డిశ్చార్జ్ చేయడం ఏమిటి అని వైద్యులను బాధితులు ప్రశ్నించినా.. లాభం లేదని వాపోతున్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మృతుని బంధువులు తెలిపారు.ఠాగూర్ సినిమా ను తలపించేలా డాక్టర్ల నిర్వహించిన తీరు ఉందని మృతి కి కారణం డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన కాగా జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటన చూసి స్థానికులు ప్రభుత్వం దవాఖాన అంటే జంకుతున్నారు.