Telugu News

శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు.

0

శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

 

సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు.

 

– కేసీఅర్ కు ఘ‌నంగా స‌త్కారం..

(యాదాద్రి భువ‌న‌గిరి  విజయం న్యూస్):-

న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్  జాతికి పున‌రంకితం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కోన్నారు..యదద్రిలో నేడు శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో జరిగిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌ శాస్రోక్తంగా జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఅర్  దంపతులతో కలిసి తాను కూడా సతీమణితో కలిసి పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందడం జరిగిందన్నారు.

also read :-కామారెడ్డి లో కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ఐదుగురు మృతి..

జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగిందని, మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసిందని వివరించారు.ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్  దంప‌తుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారని అన్నారు.శోభాయాత్ర‌, విమాన గోపురాల‌కు ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం, ఆల‌య ప్ర‌వేశం జ‌రిగిన స‌మ‌యంలో న‌మో నార‌సింహ మంత్రం ప్ర‌తి ధ్వ‌నించిందన్నారు.