Telugu News

రఘునాథపాలెం మండలానికి మహర్దశ.

రోడ్ల నిర్మాణానికి రూ.12.40కోట్ల మంజూరు.*

0
రఘునాథపాలెం మండలానికి మహర్దశ.
== రోడ్ల నిర్మాణానికి రూ.12.40కోట్ల మంజూరు.*
== ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు..
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలానికి మహర్దశ పట్టింది. మండల ప్రజల విజ్ఞప్తి మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో గ్రామీణ రహదారుల నిర్మాణం(సీఆర్ఆర్) గ్రాంట్ నుండి 6 కొత్త బ్లాక్ టాప్ (బీటీ) రోడ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
గణేశ్వరం నుండి దొనబండ్ రూ. 3.30 కోట్లు, రఘునాదపాలెం నుండి జింకల్ తండా జెడ్పీ రోడ్ వరకు రూ.2.50 కోట్లు,  బంజర నుండి మూలగూడెం వరకు రూ.1.40 కోట్లు..ఎన్ వీ బంజర నుండి మూలగూడెం వరకు రూ.1.20 కోట్లు, రఘునాధపాలెం బైపాస్ రోడ్ నుండి వయా నర్సింహులు చెరువు వరకు రూ.1.15 కోట్లు మంజూరు చేశారు. కోటపాడు నుండి పాపటపల్లి ఆర్అండ్ బీ రోడ్ వయా మంచిన చెరువు వరకు రూ.2.85 కోట్లు.. మొత్తం రూ.12.40 కోట్లతో కొత్త రోడ్లు మంజూరు చేశారు.
ఇప్పటికే మండలంలో ఆగస్ట లో వివిధ గ్రామాలను కలుపుతూ ఉన్న 6 మట్టి రోడ్లకు బ్లాక్ టాప్ రోడ్లు మంజూరు చేస్తూ రు.13.10 కోట్ల ఉత్తర్వులను ప్రభుత్వం జీఓ జారీ చేసిది.  ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు మంత్రి పువ్వాడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా రోడ్ల అవశ్యకతను వివరించి పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ రహదారుల నిర్మాణం ద్వారా మంత్రి పువ్వాడ నిధులు మంజూరు చేయించారు.
మంజూరైన పనులను త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అడిగిన వెంటనే రోడ్ల కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి రవాణా మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు కొత్త బీటీ  రోడ్లను మంజూరు చేయించిన మంత్రి పువ్వాడకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.