Telugu News

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ లక్ష్యం : నామా

%% బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం .. %% వ్యవసాయ నల్లచట్టాలపై పార్లమెంటులో ఉద్యమించాం... %% కొనిజర్ల , ముదిగొండ మండలాల పర్యటనలో టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామ నాగేశ్వరరావు

0

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ లక్ష్యం : నామా
%% బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం ..
%% వ్యవసాయ నల్లచట్టాలపై పార్లమెంటులో ఉద్యమించాం…
%% కొనిజర్ల , ముదిగొండ మండలాల పర్యటనలో టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామ నాగేశ్వరరావు

(ఖమ్మంప్రతినిధి – విజయంన్యూస్)
స్వాతంత్య్ర భారతదేశంలో సంక్షేమ పాలన అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త చరిత్రకు నాంది పలికారు … పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనతికాలంలోనే దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకున్నాం .. మహాత్ముడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సదించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారు .. ముఖ్యంగా గ్రామాలు , రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే … ‘ అని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు .

ఆదివారం రైతుబంధు సంబరాల్లో భాగంగా కొణిజర్ల , ముదిగొండ మండలాల్లో పర్యటించిన ఎంపీ నామ కొణిజర్ల మండలం లాలాపురం , ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .

ALSO READ :-మోడీ పంజాబ్ లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగ జార్చింది : భట్టి విక్రమార్క

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను , రైతులను , బడుగుబలహీన వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు . సంక్షేమం , అభివృద్ధిలో కేసీఆర్ సరికొత్త చరిత్రకు నాంది పలికారని అన్నారు . మరే రాష్ట్రంలోనూ అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఎంపీ నామ గుర్తుచేశారు .

ప్రధానంగా దేశానికి అన్నం పెట్టే రైతులకు రైతుబంధు , రైతుబీమా , 24 గంటల ఉచిత నాణ్యమైన నిరంతర విద్యుత్ తదితర పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని ఎంపీ నామ స్పష్టం చేశారు . ఇలాంటి పథకాలు అమలుచేసే నాయకుడు దేశంలో మరివరూ లేరని అన్నారు . అనేక అభివృద్ధి పథకాల్లో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని , ఇదంతా సీఎం కేసీఆర్ చల్లని పాలనకు సజీవ సాక్ష్యమని అన్నారు . తెలంగాణ రైతులు తలెత్తుకు జీవించాలన్న పవిత్రమైన ఆశయంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని అన్నారు .

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రైతులకు నష్టం చేకూరేలా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్ద్బుచేయాలని ఉద్యమించిన రైతుల్లో సుమారు 700 మందికి పైగా చనిపోతే వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉండాలన్న సదుద్దేశంతో రైతుల పోరాటంలో చనిపోయిన ప్రతీ రైతు కుటుంబానికి రూ . 3 లక్షల సాయం అందించారని గుర్తుచేశారు . ఇటీవల కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటించి అవాకులు , చవాకులు పేలారనీ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో రైతులకు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆనవాళ్లు కూడా లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎంపీ నామ చురకలంటించారు .

ALSO READ :-‘పాలేరు’ లో మరో రాఘవుడున్నాడా..?

మీ రాష్ట్రాల్లో రైతులను పట్టించుకోని మీరు తెలంగాణకు వచ్చి ప్రగల్బాలు పలుకుతారా ? అని ఎంపీ నామ ప్రశ్నించారు . తెలంగాణలోని ప్రతీ గ్రామం , రైతులు , బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఆశయంతో ముందడుగు చేస్తున్న మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని నామ కొనియాడారు . దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలు అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తూ మహాత్ముడు గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాక్షాత్కారానికి సీఎంకేసీఆర్ బాటలు వేశారని అన్నారు .

దేశానికి ఆదర్శం తెలంగాణ పథకాలు .. స్వాతంత్ర్యం అనంతరం భారత దేశంలో మరే నాయకుడు కనీసం ఆలోచన కూడా చెయ్యని విధంగా సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలతో దేశానికి సరికొత్త అభివృద్ధిని పరిచయం చేశారని ఎంపీ నామ అన్నారు . రైతు బంధు పథకం ద్వారా అతికొద్ది కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ . 50 వేల కోట్లు జముచేసి సరికొత్త చరిత్రకు నాందిపలికారని అన్నారు . అందుకే గ్రామాలు , పట్టణాలు అన్నీ కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నాయని అన్నారు . కొణిజర్ల మండలంలో అన్ని గ్రామాలు ఇప్పుడు ఒకే కాటిపై కేసీఆర్ బాటలో టీఆర్ఎస్ పార్టీ లైన్లో ఉండటం హర్షించ దగిన విషయమన్నారు . రహదారుల అభివృద్ధికి గాను గ్రామస్తులు . రూ . 8 లక్షల నిధులు కావాలని అడిగారని , ఎంపీ ల్యాడ్ నిధులనుండి రూ .10 లక్షలు మంజూరు చేస్తానని ఎంపీ నామ గ్రామస్తుల హర్ష ద్వానాల నడుమ ప్రకటించారు . టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మరియు ఎమ్మెల్సీ మధు తో కలిసి ఆదివారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలోని లాలపురం గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు రైతుబంధు సంబరాల్లో పాల్గొన్నారు .

ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ జైపాల్ గొల్లపాడు సీతారాములు , వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతరములు , స్థానిక కౌన్సిలర్లు రామారావు , వేణు , కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత , ఎంపీపీమధు , వైస్ ఎంపీపీ రమణ , టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై . చిరంజీవి జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మాధవరావు పీఏసీఎస్ చైర్మన్ వెరుకుమల్లి రవి , వైరా మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు , వైరా టౌన్ ప్రెసిడెంట్ దారన్న రాజశేఖర్ , కట్ట కృష్ణార్జున రావు , విశ్వేశ్వర్ రావు , మండల ఎస్టీ సెల్ కార్యదర్శి భూక్యా నరసింహ నాయక్ , కో ఆప్షన్ నెంబర్ మౌలానా , సర్పంచ్ లు మోహనరావు , లక్ష్మి , మాన్సింగ్ , నాగమణి , నాగేంద్ర కాంతమ్మ , నీలా , టీజర్ఎస్ నాయకులు దేరంగుల బ్రహ్మం పొడపోతుల బాబు , పాసంగులపాటి శీసు పోగుల క్రీసు కె.వి ముత్యాల నాగేశ్వర రావు , ప్రకాష్ , గోపాల్ , రవీందర్ , దవా విజయ్ , మాన్సింగ్ వీరన్న , నరసింహ , ముదిగొండ మండలానికి చెందిన నాయకులు వెంకటాపురం గ్రామ సర్పంచ్ కోటి అనంతరాములు , జడ్పీటీసీ పసుపులేటి దుర్గ , నేలకొండపల్లి ఏఎంసీ డైరెక్టర్ బంకా మల్లయ్య , రైతుబంధు ముదిగొండ మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్ , పీఏసీఎస్ చైర్మన్ సామినేని వెంకయ్య , డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాస్ , వెంకటాపురం గ్రామ ఉపసర్పంచ్ గంటా పద్మావతి , లంకెల బ్రహ్మారెడ్డి , ముదిగొండ మండల వ్యవసాయ అధికారి ఎం . రాధ , స్థానిక కౌన్సిలర్ లు , గ్రామ రైతు బంధు కన్వీనర్లు , ఏఎంసీ డైరెక్టర్లు సొసైటీ డైరెక్టర్లు , టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు .

ALSO READ :-*నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ.