Telugu News

బీఆర్ఎస్ పాలనలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌.: మంత్రి పువ్వాడ

ఖమ్మంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు

0

బీఆర్ఎస్ పాలనలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌.: మంత్రి పువ్వాడ

== మ‌హిళ‌ల సాధికార‌త కోస‌మే అనేక ప‌థ‌కాలు.

== మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కం.. వడ్డీ రహిత రుణాలు..

==  మహిళా అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి.

== దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం.. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు.ః

== ఖమ్మంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు

== హాజరైన మంత్రి పువ్వాడ, కలెక్టర్, ఎమ్మెల్సీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ గారు అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా ఆరోగ్య ప‌థ‌కాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మహిళలకు తినిపించారు.

ఇదికూడా చదవండి: ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..: మంత్రి పువ్వాడ

బిలీఫ్ హాస్పిటల్స్ అధినేత మేడంపూడి రమాజ్యోతి అధ్వర్యంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నందు జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గోన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుంది. దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం మ‌న రాష్ట్రంలోనే జ‌రిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళల ఆరోగ్యం కోసం అరోగ్య మహిళ, వడ్డీ రహిత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్నారని, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మహిళలకు అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పించారని అన్నారు.

ఇదికూడా చదవండి: ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావడమే మా లక్ష్యం: పువ్వాడ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని వారు అన్నారు.రూ.750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి మహిళల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల‌లో 250 కోట్ల రూపాయ‌లు ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌హిళ‌ల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మ‌హిళ‌ల కోస‌మ‌ని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల‌లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు.

ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్ల‌ల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివ‌రించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో సిఎం కెసిఆర్ గారికి, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి: నడిరోడ్డుపై మంత్రి ఏం చేశారంటే..?

రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారని అన్నారు.చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని తెలిపారు.

ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.మహిళా రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దక్కుతాయని, అలాగే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ లలో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి:    రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్  ఆకాంక్ష: కమల్ రాజు

రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, అయితే లోక్ సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని, కానీ బిజెపికి చిత్తశుద్ధి లేదని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పలువురుకి మహిళలకు శాలువాతో సత్కరించారు.ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,ZP చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DM &HO మాలతి, ZPTC ప్రియాంక, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.