Telugu News

రాజీవ్ గృహకల్ప లో వ్యక్తి ఆత్మహత్య

అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శవాన్ని కిందకు తీసుకొచ్చిన టీమ్

0

రాజీవ్ గృహకల్ప లో వ్యక్తి ఆత్మహత్య

== కుల్లిపోయిన మృతదేహం

== అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శవాన్ని కిందకు తీసుకొచ్చిన టీమ్

(ఖమ్మంరూరల్-విజయంన్యూస్)

 

ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప లో  ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మూడో అంతస్తులో విఫరీతమైన దురవాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తక్షణమే సంఘటన వద్దకు వచ్చిన పోలీసులు మూడవ అంతస్తు వద్దకు వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. చివరికి తలుపులు పగలగొట్టి చూడగా  గంటా సైదులు(30) చిన్న తాడుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఇప్పటికే మూడు నాలుగు రోజులు అవ్వడంతో విఫరీతమైన దురవాసన వస్తుండటంతో పోలీసులు ఆ శవాన్ని అక్కడ నుంచి తరలించడం కత్తిమీద సాముగా మారింది. దీంతో పోలీసులు అన్నం ఫౌండేషన్ ని సంప్రదించగా అన్నం ఫౌండేషన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలంచారు. అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు నేతృత్వంలో కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని మూడో అంతస్తు నుండి ఇరుకుమెట్లలో అత్యంత కష్టంగా ఉరితాడు నుండి తప్పించి మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల శవపరీక్ష గది కి తరలించడం జరిగినది. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలాయపాలెంలో అక్రమ ఇసుక కై ఘర్షణలుః