Telugu News

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి.

మహబూబాబాద్ జిల్లా విజయం న్యూస్

0

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి.

(మహబూబాబాద్ జిల్లా విజయం న్యూస్):-
చిన్నగూడూరు మండలంలో కుటుంబ కలహలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగోలిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక చిన్న గూడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వి.విజయ్ రామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మంగోలిగూడెం గ్రామానికి చెందిన భానోత్ శంకర్,(35)కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు.

ఈ క్రమంలో నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడని మద్యం మత్తులో రోజు భార్య తో గోడవపడే వాడని ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మద్యం మత్తులో భార్యతో గొడవపడి క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య స్థానికుల సహాయంతో మహబూబాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం శంకర్ మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

also read :- ఖమ్మంల ఓటు హక్కును వినియోగించుకున్న సీఎల్పీ నేత భట్టి