Telugu News

భూకంపాలు ఎప్పుడైనా రావచ్చు.. సంచనల ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు

హైరానా వద్దంటున్న సాంకేతిక నిపుణులు..

0

భూకంపాలు అనివార్యమే..! – గోదావరి తీరాల్లో ఎప్పుడైనా రావచ్చు..
– ‘భూ’పొరల్లోని తీవ్రతలే ఇందుకు మూలం
– సముద్రాల్లోనైతే సునామీలు – భూమి పై అయితే భూకంపాలు…
– హైరానా వద్దంటున్న సాంకేతిక నిపుణులు..

(మంచిర్యాల-విజయం న్యూస్)
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భూకంపాలు రావడం సహజమేనని, వాటికి హైరానా పడాల్సిన అవసరం లేదని సాంకేతిక నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపాలు సంభవించిన నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను వారు నివృత్తి చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఈ భూకంపాలు సహజమేనని కూడా వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి..? ఇవి రావడానికి చోటు చేసుకునే పరిణామాలేమిటీ..? అన్నదానిపై ‘విజయం: అందిస్తున్న ప్రత్యేక కథనం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల(శనివారం) భూకంపం సంభవించడం ఆందోళనకు దారి తీసింది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూప్రకంపనలు రావడం సహజంగానే ఈ ఆందోళనకు కారణం అని చెప్పవచ్చు. వాస్తవానికి జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు ఉన్న నేపథ్యంలో ఆ సంస్థకు ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బ్లాస్టింగ్ అనే ఈ ప్రక్రియ చేపడతారు.‌బొగ్గు వెలికితీతకుగాను ఈ పేలుళ్లు జరుపుతారు.‌ అయితే అప్పుడప్పుడు ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాన్ని ఉపయోగించే సందర్భాల్లో దాని ధాటికి భూమి కంపించిన సందర్భాలు ఉన్నాయని, కనిపించినట్లు అవుతుందని జిల్లా వాసులు చెబుతున్నారు. తాజాగా కూడా ఇలాగే జరిగిందని భావించారు. కాగా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలో కాకుండా కరీంనగర్ ఇతర జిల్లాల్లోనూ ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలంతా భూకంపం వచ్చింది నిజమేనని ఊపిరి పీల్చుకున్నారు.

భూ పొరల్లోని తీవ్రత, హెచ్చుతగ్గులు కారణం…
వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకునే తీవ్రత కారణంగా ‘భూకంపాలు అనేవి సహజంగానే సంభవిస్తాయి’ అన్నది మేధావుల అభిప్రాయాన్ని బట్టి స్పష్టం అవుతోంది. భౌతిక శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు తెలిపిన ఈ సమాచారాన్ని భూమి పొరల్లో తరచూ మార్పులు అనేవి చోటుచేసుకుంటాయి. ఒక పై మరో పొర వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు అనేవి ఏర్పడతాయి. ఇదే సందర్భంలో ఈ రెండు పొరల మధ్య ఒత్తిడి, తీవ్రతలు సైతం కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. తక్కువ మోతాదులో తీవ్రత ఉండి ఉంటే భూ కదలికలు అనేవి ఉండవు. ఈ రెంటి మధ్య ఒత్తిడి ఎక్కువైతేనే మాత్రం భూకంపాలు సంభవించే ఆస్కారం ఉందని అంటున్నారు.

ALSO READ:- మంచిర్యాలజిల్లాలో భూ కంపం..

ఇవి మూడు దశల్లో ఉంటాయని, ఒకటీ ప్రైమరీ స్థాయి కాగా మరాటి సెకండరీ లెవల్ అని మేధావులు వివరిస్తున్నారు. షిరిడి సాయి లో నుంచి హై లెవల్ లో ఒత్తిళ్లు సంభవిస్తూనే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై అధికంగా నమోదవుతుందని స్పష్టం చేస్తున్నారు ఏదేమైనా భూకంపాలకు భూమి లోపల కుండ పొరల్లో సంభవించే వాతావరణ మార్పుల పరిణామమని తెలుస్తోంది.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహజమే…
తాజాగా సంభవించిన భూకంపాల పాటు క్రమంలో మరికొన్ని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి భూకంపాలు రావడం సహజమేనని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందీ ఏమీ లేదని కూడా మేధావులు ఒక రకంగా చెబుతున్నారు. దీనికితోడు గోదావరి తీరం పక్కనే తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు కూడా ఉండడం మరో కారణమని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు కారణాలు భూకంపాలు సంభవించేందుకు దారితీస్తాయని వివరిస్తున్నారు. గతంలో సంబంధించిన సంభవించిన భారీ భూకంపాల ఈ నేపథ్యంలో మీ అభిప్రాయాలు వెలువడిన సంగతి తెలిసిందే. భుజ్, కోచ్ భూకంప విషాద ఘటనల సందర్భంలోనే ఇలాంటి వార్తలు వెలువడ్డాయి.

సముద్రంలోనైతే సునామీలు…
వాతావరణంలోని సహజ మార్పుల్లాగే భూ పొరల్లోని మార్పుల కారణంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. భౌతికంగా భూమి ఉన్నచోట భూ పొరల్లోని మార్పుల కారణంగా భూకంపాలు సంభవిస్తే… సముద్రాలు ఉన్నచోట అవి సునామిలుగా ఏర్పడతాయని మేధావులు వెల్లడిస్తున్నారు. అటు భూకంపాలు సునామీలు.. ఈ రెంటికి కూడా సూపర్ లోని భూ పొరల్లోని మార్పులు ఒత్తిళ్లు తీవ్రతల ప్రభావం ప్రభావమేనని చెబుతున్నారు ఏదేమైనా ఈ తాజాగా చోటుచేసుకున్న భూకంపాలు తెలంగాణ వ్యాప్తంగా కొంత ఆందోళనలో పడేసింది మాత్రం ముమ్మాటికీ వాస్తవమేనని ఫస్ట్ మారుతోంది.

ALSO READ :- పోడు పంచాయతీ తెలుద్దాం: సీఎం కేసీఆర్