Telugu News

మంచిర్యాలజిల్లాలో భూ కంపం..

స్వల్పంగా కంభించిన భూమి.. పరుగులు తీసిన జనం

0

మంచిర్యాలజిల్లాలో భూ కంపం..

స్వల్పంగా కంపించిన భూమి

— భయంతో బయటకు పరుగులు తీసిన జనం 

(మంచిర్యాల-విజయంన్యూస్)

మంచిర్యాల జిల్లాలో శనివారం భూకంపం వచ్చింది.. భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా కేంద్రం లోని చున్నoభట్టివాడ, శ్రీ శ్రీ నగర్, తో పాటు సీతారాంపల్లి, నస్పూర్ , సీతా రాంపూర్, అమ్మ గార్డెన్ ప్రాంతాలలో భూకంపం వచ్చింది. 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపిoచిన భూమితో జనం భయం తో ఇండ్ల ల్లో నుండీ బయటకి పరుగులు తీశారు. ఏం జరిగిందో రెండు నిమిషాలు ఎవరికి అర్థం కాలేదు. ఆ తరువాత భూకంపం వచ్చిందని తెలుసుకుని, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరిపిల్చుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది.

 also read :- సర్కార్ బడికి పోదాం చలో చలో