కుక్కల స్వైర విహారం
— చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
(మందమర్రి – విజయం న్యూస్)
మందమర్రి మండలంలోని క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో వందలాదిగా కుక్కలు గుంపులుగా తిరగడం వల్ల ప్రజలు బయటకు వెళ్ళడానికి జంకుతున్నారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికుడి తో సహా సుమారు 20 మందిని కుక్కలు గాయపరచడం జరిగింది . గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన ప్రజల సమస్యలు తీర్చడంలో అధికారులు విఫలం అయ్యారని ఇక్కడి ప్రజలు అంటున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ఈ బాటలోనే ప్రయాణిస్తూ చూస్తూ ఉండిపోతున్నారు తప్ప వాటి నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నం చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రద్దీగా ఉండే బీజోన్ సెంటర్, రాజీవ్ చౌక్ రైల్వే స్టేషన్ సూపర్ బజార్ ఏరియాల్లో ద్విచక్ర వాహనాలపై వచ్చే వారిపైన దాడి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వీధి దీపాలు సరిగ్గా వెలగక పోవడం వల్ల కాలిబాటన వెళ్లే మహిళలు, చిన్నారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్ర లోంచి మేలుకొని కుక్కల నుంచి ప్రజలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ చూడాలనుకుంటున్నారా.. బ్రెకింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే👆 ఒపెన్ చేయండి మీకు కనిపించే 🛎️ గంటను నొక్కండి.. ఎప్పటికప్పుడు ‘మా న్యూస్ మీ ముంగిట..’
also read : వృద్దురాలుకు వెంటవెంటనే డబుల్ డోస్