Telugu News

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే సీతక్క

మంగపేట మండలం లోని కార్యదర్శుల పని తీరు బాగు లేదు పద్దతి మార్చుకోండి ప్రజలకు అందుబాటులో ఉం డండి

0

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మంగపేట మండలం లోని కార్యదర్శుల పని తీరు బాగు లేదు పద్దతి మార్చుకోండి ప్రజలకు అందుబాటులో ఉం డండి
కరకట్ట టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు చేపట్టాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క 

(ములుగు-విజయం న్యూస్)

ములుగు జిల్లా,  మంగపేట మండల కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశములో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారు అని వరి వేస్తే ఉరి అని ప్రభుత్వం అనడం సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ రైతులను నట్టేట ముంచిన పరిస్థితి ఈ రాష్ట్రం లో ఉందని గత ఏడాది దొడ్డు వడ్లు పెట్టే ద్దు అన్నాడు ఈ సారి అసలు వరి పంట సాగు చెయ్యద్దు అని మాట్లాడటం రైతులకు ఇబ్బంది పడుతున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దగ చెయ్యడం తప్ప వేరే కాదని కోటి ఎకరాలకు సాగునీరు అందించే నందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు వరి సాగు చెయ్యద్దు అనడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం మేము దాన్యం కొనుగులు చెయ్యడానికి మాకు ఇబ్బందులు లేవని చెపుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది అని ముఖ్య మంత్రి అనడం అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చెయ్యడానికి తప్ప వేరే కాదని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని సీతక్క గారు అన్నారు. అదే విధంగా మంగపేట మండలం లోని కార్యదర్శుల పని తీరు బాగు లేదని కొంత మంది అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కార్యదర్శుల పై కలెక్టర్ గారి దృష్టికి తీసుకు పోతానని పని చెయ్యని కార్యదర్శులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరించారు.  కొన్ని సంవత్సరాలుగా మంగపేట ఏటూరు నాగారం గోదావరి పక్కన ఉన్న గ్రామాల ప్రజల కల తీరబోతుంది అని ముఖ్య మంత్రి గారి దగ్గర పెండింగ్ లో ఉన్న కరకట్ట నిర్మాణ పనుల ఫైల్ పై సంతకం జరిగింది అని వెంటనే ఐబీ అధికారులు టెండర్ ప్రక్రియ పనులు పూర్తి చేసి నిర్మాణ పనులు చేపట్టాలి సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ప్రజా పోరాటాలు ఉద్యమాల ద్వారా ఇటు అసెంబ్లీ లో కరకట్ట నిర్మాణ పనుల పై ప్రస్తావించిన సంఘటన ఇట్లా అనేక విధాలుగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం మూలాన మనం కరకట్ట నిర్మాణ పనులు చేసుకో పోతున్నాం అని సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్, మండల అధ్యక్షులు జయరాం రెడ్డి కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లిపల్లి శివ ప్రసాద్ గారు బ్లాక్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్ .మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్.st సెల్ జిల్లా కార్యదర్శి దేవుడా శ్యామ్ లాల్ .యూత్ ములుగు జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు. మండల ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి .ప్రధాన కార్యదర్శులు యానయ్య. కొంకటి సాంబశివరావు. ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మల్లన్న మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిదైతుల సీతక్క యువజన మండల అధ్యక్షులు సిద్దబత్తుల జగదీశ్వరావు. యూత్ మండల ఉప అధ్యక్షులు కుర్సం రమేష్ . ఫయాజ్ సీనియర్ నాయకులు దామెర సారయ్య డిగ్గొండి కాంతారావు పూజారి సమ్మయ్య కొమరం సారన్న కొమరం బలన్న మార్పుల దయాకర్ రెడ్డి సర్దన నర్సన్న సర్దన మల్లన్న బండపల్లి ప్రశాంత్ పందిరి మోహన్ సిరికొండ ప్రసాద్ కొత్త రాంబాబు కొమరం కన్నయ్య md హుసేన్ ఎంపీటీసీ రాంబాబు,మేడం రమణ కర్, అశోక్ లు తదితరులు పాల్గొన్నారు