Telugu News

గాడితప్పిన “సహాకార”0

నిబంధనలకు విరుద్ధంగా కళ్ళల్లో లోడింగ్.

0

నిబంధనలకు విరుద్ధంగా కళ్ళల్లో లోడింగ్. ** దళారులకు అండగా జిల్లా అధికారులు

**క్వింటా కి 10 కేజీల తరుగు తీస్తున్న వైనం.

** మద్దతు ధర దక్కని అన్నదాత.

(మంగపేట- విజయం న్యూస్):-

మంగపేట మండలంలో తిమ్మంపేట, మల్లూరు గ్రామ సరిహద్దులలో AP20 TB 3249 నంబరు గల లారీలో సహకార సంఘానికి సంబంధించిన బస్తాలలో నింపిన ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకార సంఘం నిబంధనల ప్రకారం, సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు అమ్మకంనకు తీసుకొచ్చిన ధాన్యమును ఏ ఈ ఓ తనిఖీ చేసిన తదుపరి, రైతు వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి,సిఫార్సు చేసిన మిల్లుకు తరలిస్తారు.కానీ అందుకు విరుద్ధంగా దళారులకు అండగా కొనుగోలు కేంద్రాల సిబ్బంది,సహకార సంఘం అధికారుల అండదండలతో నేషనల్ హైవే పై ధాన్యం లారీలో ధాన్యం బస్తాలు నింపుతున్నారు. దళారులకు అధికారుల “సహకారం” దండిగానే ఉంది.సన్న, చిన్న కారు రైతులు, కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల కోసం, బస్తాల కోసం పడిగాపులు కాస్తుంటే, దళారులకు సహకార సంఘం అధికారుల సహకారంతో గంటల వ్యవధిలోనే తమ పని చక్కబెట్టుకుంటున్నారు.సీఈవో అండదండలతోనే ధాన్యం కొనుగోలుకు దళారులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ధాన్యం కొనుగోలు దందాకు తెరలేపారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రంలలో ఉన్న సిబ్బంది, సహకార సంఘం అధికారులు,రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై ఒక్కొక్క క్వింటా కి 10 కేజీల పైగా తరుగు పేరుతో ధాన్యం దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కటం లేదు.జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డి సి ఓ సర్దార్ సింగ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి ధాన్యం కొనుగోలు ఎటువంటి అవకతవకలు జరగకుండా,దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని,నాణ్యమైన తమ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర అందేలా చేయాలని రైతులు కోరుతున్నారు.

allso read :- యువకుడిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.