Telugu News

కాంగ్రెస్ పార్టీ పదవులపై ఠాగూర్ సంచలన ప్రకటన

నాయకుల వెంట తిరిగితే నాయకుడు కాలేరని స్పష్టం చేసిన ఠాగూర్

0

కాంగ్రెస్ పార్టీ పదవులపై ఠాగూర్ సంచలన ప్రకటన
** నియామక ప్రక్రీయకు స్వస్తీ చెప్పిన కాంగ్రెస్
** గ్రామశాఖ నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ఎన్నికలు తప్పదన్న మాణిక్యంఠాగూర్
** సభ్యత్వ నమోదు నత్తనడకనపై ఇంచార్జ్ తీవ్ర అసంతప్తి
** రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నాయకులపై ఆగ్రహం
** నాయకుల వెంట తిరిగితే నాయకుడు కాలేరని స్పష్టం చేసిన ఠాగూర్
(హైదరాబాద్-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకులందరికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్ర సంచలన ప్రకటన చేశారు.. అలాగే ఆశావాహులకు శుభవార్త కూడ చెప్పారు..ఇప్పటి వరకు గ్రామ కమిటీ నుంచి మండల కమిటీల వరకు నియమాక ప్రక్రీయ ఉండేదని, కానీ ఇక నుంచి నామినేషన్ దాఖలు చేయడం, పార్టీ సభ్యులందరు ఓటింగ్ వేయాల్సిందేనని అందులో గెలిచిన వారు మండల,గ్రామకమిటీలకు అధ్యక్షుడిగా ఎన్నికైతారని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి,గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనాయకుల సమావేశంలో హాజరైన మాణిక్యం ఠాగూర్ సంచలన ప్రకటన చేశారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారని,ఇలా చేస్తే నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నాయకులతో తిరుగుతూ కండువలు కప్పినంత మాత్రాన నాయకులు కాలేరని, పదవులు రావని, కచ్చితంగా సంస్థాగతంగా పనిచేస్తేనే పదవులు వస్తాయని తెలిపారు. తెలంగాణలో ఇక నుంచి కచ్చితంగా మండల, గ్రామ కమిటీల నియామకంను రద్దు చేస్తున్నామని తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడైనా, మండల కమిటీ అధ్యక్షుడైనా కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని, సభ్యత్వం తీసుకున్న ముఖ్యనాయకులు ఓటింగ్ వేసి విజయం సాధించిన వారే ఆ పదవికి అర్హులవుతారని తెలిపారు. సభ్యత్వ నమోదు విషయంలో కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నగర కమిటీ, జిల్లా అధ్యక్షులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి : రాహుల్ కు బాసటగా సీఎం కేసీఆర్.. మోడీ ప్రభుత్వంపై ద్వజం