Telugu News

మణిపూర్ నుంచి సేఫ్ గా ఖమ్మంకు

ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విద్యార్థి తల్లిదండ్రులు

0

మణిపూర్ నుంచి సేఫ్ గా ఖమ్మంకు

== ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విద్యార్థి తల్లిదండ్రులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మణిపూర్ లో అంతర్గత యుద్ధం కారణంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం తో మాట్లాడి సొంత ఖర్చులతో రాష్ట్రానికి రప్పించనున్న నేపథ్యంలో ఈరోజు మణిపూర్ లోని ఇంఫాల్ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీలోని టెర్మినల్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి డి.హర్షవర్ధన్, ఎన్ఐటి, బీటెక్ సెకండియర్ చదువుతున్న, ఖమ్మం జిల్లా రాంనగర్ తండాకు చెందిన,అనే అబ్బాయి సోమవారం రాత్రి 10.30 చేరుకున్నారు అక్కడి నుండి తెలంగాణ భవన్ కు తీసుకువెళ్లి విద్యార్థికి కావలసిన ఏర్పాట్లను చేసి ఈరోజు ఇక్కడ ఉండి రేపు ఉదయం తన స్వస్థ స్వస్థలమైన. ఖమ్మంకూ పంపించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు, మణిపూర్ లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రేసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి హర్షవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

allso read- ప్రజా అవసరాల కోసమే అభివృద్ది పనులు: మంత్రి పువ్వాడ