Telugu News

బడుగుల నోట్లో మట్టి కొట్టాలనే ప్రతిపక్షాల ప్రయత్నం: మంత్రి పువ్వాడ

జిల్లాలోకి రాజకీయ వలస పక్షులు వస్తున్నాయ్..జాగ్రత్త

0

బడుగుల నోట్లో మట్టి కొట్టాలనే ప్రతిపక్షాల ప్రయత్నం

★ జిల్లాలోకి రాజకీయ వలస పక్షులు వస్తున్నాయ్..జాగ్రత్త

★ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రెసిడెన్షియల్ గురుకులాలు పని చేస్తున్నాయి

★ రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్స్ఎన్సి ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నాం

★ నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తాం, అడిగిన వెంటనే సీఎం కేసిఆర్ ఖమ్మం కు మెడికల్ కాలేజీ ఇచ్చారు

★ త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన

★ కేటీఆర్ దావోస్ పర్యటనతో తొలిరోజే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు పెట్టుబడులు

★ అభివద్ది కార్యక్రమ ప్రారంభ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

బడుగుల నోట్లో మట్టి కొట్టాలని ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివద్దిని అడగుడుగున అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన ఖమ్మం అభివద్దిని ఎవరు ఆపలేరి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో 30ఏళ్ల పాటు రాజకీయాలు అనుభవించి ప్రజా ధనాన్ని లూటీ చేసి పరారైన నాయకులు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు  రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని, వారి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్ ను గిరిజన శాఖ మంత్రి సత్వతి రాథోడ్‌తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకం కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన 243 మందికి బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్- 61 ఆయా లబ్ధఙదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తామని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తామన్నారు. కేటీఆర్ దావోస్ పర్యటనతో తొలిరోజే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రెసిడెన్షియల్ గురుకులాలు పని చేస్తున్నాయని తెలిపారు.  రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్స్ఎన్సి ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నామని,  నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తాం, అడిగిన వెంటనే సీఎం కేసిఆర్ ఖమ్మం కు మెడికల్ కాలేజీ ఇచ్చారని తెలిపారు. అతి త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన  చేసేందుకు వస్తున్నారని, తద్వారా ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీ కల నేరవేరుతుందన్నారు. కొంత మంది ప్రతి పక్ష నాయకులు, పనిపాట లేని వ్యక్తులు మంత్రి తన మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీని అడ్డుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేశారని, వారికి చెంపదెబ్బకొట్టే సమాధానం అతికొద్ది రోజుల్లోనే ఉండబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం నగరమేయర్ పూనకొల్లు నీరజ తదితరులు హాజరైయ్యారు.

సంక్షేమ పథకాలు అమలు పర్చడంలో తెలంగాణ నంబర్ వన్