Telugu News

 పేదల నడ్డి విరుస్తున్న వారాల వడ్డీ..

వారాల వడ్డీ ఆలస్యమైతే చుక్కలు చూడాల్సిందే..

0

 పేదల నడ్డి విరుస్తున్న వారాల వడ్డీ..

== వారాల వడ్డీ ఆలస్యమైతే చుక్కలు చూడాల్సిందే..

== ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వడ్డీ వ్యాపారం…

== చిరు వ్యాపారాలు రోజు కూలీలు వారే టార్గెట్…

== నిరుపేదల అవసరాలే వారికి పెట్టుబడి..

== “కా(ల)ల్”  నాగుల్లా వడ్డీ వ్యాపారులు…

మణుగూరు (విజయం న్యూస్)

 

ఎటు చూస్తే అటు కాల్ నాగులు రెచ్చిపోయే రుణ సర్పాలు బుసలు కొడుతున్నాయి, పేదల అవసరాలే దన్నుగా అల్లుకుపోతున్నాయి జనారణ్యంలో విషం చిమ్ముతూ చెలరేగుతున్నాయి పాములలో రకరకాల జాతులు ఉన్నట్లే కాల్ నాగుల్లోను రకరకాల రూపాలు ఒక్కోచోట ఒక్కో పేరు  ఒక్కోచోట ఒక్కో తీరు అవి చిమ్మే వడ్డీ విషం మాత్రం ఒక్కటే  పినపాక నియోజకవర్గం లో మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, జానంపేట, బయ్యారం, కరకగూడెం, తదితర మండలాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి సినీ పక్కిలో ఇళ్లకు వచ్చి వారం వడ్డీకి డబ్బులు ఇచ్చి మరి అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు.

alls0 read-నేనున్నాంటున్న నామా 

అప్పు తీసుకొని గ్రహ పాటుగా చెల్లించడంలో ఆలస్యం అయితే చాలు ఇక చుక్కలు చూపిస్తున్నారు వడ్డీ మాఫియా ఉచ్చులో చిక్కితే చాలు జలగల్లా రక్తాన్ని పీల్చుతున్నారు, వారాల వడ్డీతో నిలువు దోపిడీ చేస్తున్నారు నగరాల నుంచి బడా వడ్డీ వ్యాపారులు మండలంలోని వివిధ గ్రామాల్లో నిరుపేదలను ఆసరా చేసుకొని వారి వ్యాపారాన్ని సాగీస్తున్నారు వడ్డీ రాబందుల ఉచ్చులో చిక్కుకొని సామాన్య మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి .మండలంలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది ఎక్కడికి అక్కడ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి కొందరు వ్యాపారుల అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. మరికొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అమాయకులను రెట్టింపు వడ్డీలతో దోపిడీ చేస్తున్నారు దీంతో అసలు కన్నా వడ్డీ ఎక్కువై అప్పు కట్టలేని పరిస్థితుల్లో లబోదిబోమంటున్నారు. వ్యాపారుల అధిక వడ్డీలు వసూలు చేస్తుండడంతో అప్పు తీసుకున్న ప్రజలు అల్లాడిపోతున్నారు వడ్డీ వ్యాపారులు 2000 నుంచి 2 లక్షల వరకు అప్పులు ఇస్తున్నారు రకరకాల సంస్థల పేరుతో వ్యాపారులు వడ్డీలకు ఇస్తున్నారు పల్లెలు చిరు వ్యాపారులు వడ్డీ మాఫియా చేతిలో కుదేలవుతున్నారు తీసుకున్న అప్పును వారాలవారీగా వసూలు చేస్తున్నారు పదివేల నుంచి వారి అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకున్న ప్రతివారం అసలు వడ్డీ చెల్లించాల్సిందేనని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టలేకపోతే నానా బీభత్సం సృష్టించడంతో పాటు బండ బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందాతో పరువు తీస్తున్నారని స్థానికులు వాపోతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటే జలగల్లా తమనెత్తురు తాగుతున్నారని ఆవేదన చెందుతున్నారు పక్క రాష్ట్రాలకు చెందిన వడ్డీ వ్యాపారులు అమాయక ప్రజలను చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకొని దందా చేస్తున్నారని వాపోతున్నారు అప్పులు తీసుకున్న తాము వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నామని ఇప్పటికైనా వారి ఆగడాలకు కళ్లెం వేయాలని చిరు వ్యాపారులు సామాన్య ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

allso read- నేనున్నాంటున్న నామా 

 

== ఫైనాన్స్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు : మణుగూరు సిఐ ముత్యం రమేష్

 

మండలంలో అనుమతి లేని చిట్టీలు కానీ  రోజువారి ,వారాల ఫైనాన్స్ ల, పేరుతో అమాయక ప్రజలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని మణుగూరు సీఐ ముత్యం రమేష్ హెచ్చరించారు ఫైనాన్స్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీల పేరుతో వేధించే వారి వివరాలను ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మణుగూరు సీఐ ముత్యం రమేష్ సోమవారం ఆయన  “విజయం” పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు.