Telugu News

డ్రైనేజీల నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటేనా….?

అంతా మా ఇష్టం .. గుత్తేదారుల ఇష్టారాజ్యం

0
డ్రైనేజీల నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటేనా….?
== పంచాయితీ వాసుల కలలకు తూట్లు…
== నీరుగారి పోతున్న రేగా సంకల్పం…
== సింగరేణి సేఫ్ నిధులు నీట పాలు…
 == అంతా మా ఇష్టం .. గుత్తేదారుల ఇష్టారాజ్యం
== అధికారుల పర్యవేక్షణ కరువు…
== టెండర్ ప్రక్రియ నిల్ అంతా కార్యకర్తల భోజ్యమేనా… ?
మణుగూరు,జులై 17(విజయం న్యూస్)
సమితి సింగారం పంచాయతీలోని ప్రజలకు మురుగునీటి కష్టాలు తప్పడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంకల్పానికి నీరుగారిపోతుంది.ఆయన అభివృద్ధికి ఆటంకం కల్పించేందుకు బినామీ గుత్తేదారులు సరికొత్త ఎత్తుగడలు చేస్తున్నారు. సమితి సింగారం పంచాయతీలోని స్థానిక కిన్నెర కళ్యాణ మండపం వెనుక భాగం లో కోమటి పురుషోత్తం ఇంటి నుండి తోటకూరి సత్యనారాయణ ఇంటి వరకు రూ ఐదు లక్షల రూపాయల సింగరేణి సేఫ్ నిధుల తో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటగానే మారుతుంది. రేగా సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన ఓ వ్యక్తి సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులను చేజీక్కించుకొని తూతూ మంత్రపు నిర్మాణంగా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం వర్షాలకు కొట్టుకుపోయి అధికార పార్టీ ప్రతిష్టకు భంగం కల్పించే పరిస్థితి నెలకొంది.
సదరు కాంట్రాక్టర్ ఆయనకు దక్కిన డ్రైనేజీ నిర్మాణ పనులను గుడ్ విల్ ఇవ్వడంతో మరొక బినామీ కాంట్రాక్టర్కు పనులను అప్పగించారు. గతంలో ఆ కాంట్రాక్టర్ ఇసుక నుండి తైలం తీయవచ్చు అభివృద్ధి నుండి డబ్బులు దొండుకోవచ్చనే సంకల్పంతో అనేక ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణాలను చేపట్టి తూతూ మంత్రంగా నిర్మాణాలు నిలిచాయి సదరు కాంట్రాక్టర్ పై ప్రజలు బహిరంగ విమర్శలు గుప్పిచ్చిన సంఘటనలు కోకొల్లాలు కాగా ఆయనకే తిరిగి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎలా అప్పగిస్తారని ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు కాగా అదే గుత్తేదారుడు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. పంచాయితీ వాసులు వ్యక్తం చేసిన భయాందోళన లే నేడు నిజం అని నిరూపించారు సదరు గుత్తేదారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కాంట్రాక్టర్ నిర్మించిన నిర్మాణాలు నీటి వరదకు కొట్టుకొని పోయాయి. దీంతో పంచాయతీలోని ప్రజలు తమకు డ్రైనేజీ కష్టాలు తప్పుతాయని భావించిన ప్రజలకు ఆ కాంట్రాక్టర్ అధికార దాహానికి పంచాయతీలోని ప్రజలు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి.
డ్రైనేజీ పర్యవేక్ష పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ వ్యక్తిగత పనుల కోసం ఖమ్మం పట్టణం చుట్టూ చక్కర్లు కొడుతూ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో కనీసం కన్నెత్తి చూడడం లేదని ఆ పంచాయతీకి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలలో డ్రైనేజీ నిర్మాణాల కోసం కోట్లాది రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నుండి స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు పోరాడి సాధించిన అభివృద్ధి పనులకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీంతో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు పూర్తికాకముందే సుమారు 500 మీటర్ల మేర నిర్మించిన డ్రైనేజీ ఎలా కొట్టుకుపోయిందని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రొటేషన్ పద్ధతిలో ఒబినామీ

కు పనులు కట్టబెట్టిన సమితిసింగారం పంచాయతీ కి చెందిన స్థానిక ప్రజాప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సింగరేణి సంస్థ సేఫ్ నిధులను నీటిపాలు ఎలా చేస్తారని వారు వార్డ్ మెంబర్ పేరుతో పనులను దక్కించుకున్న ఆయన అధికార పార్టీకి తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తూ మరో గుత్తేదారుకి ఎలా కట్టబెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్విల్ పేరుతో పనులను ఎలా కట్టబెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు .ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు , సింగారం పంచాయతీలోని చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించి అక్రమార్కులపై చర్యలు చేపట్టి సింగరేణి సేఫ్ నిధుల నిర్మాణాలకు న్యాయం చేయాలని  ప్రజలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు  అన్న చందంగా సాగిన నిర్మాణాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టి కేంద్రీకరించి  సదరు కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టి కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని  పంచాయతీ వాసులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

అక్రమ గుత్తేదారులపై చర్యలు చేపట్టాల్సిందే కాంగ్రెస్ నేత ఆగ్రహం: గోళ్ళ సాంబయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ..

 

సమితి సింగారం పంచాయతీలోని అశోక్ నగర్ స్థానిక కిన్నెర కల్యాణ మండపం వెనుక భాగం నుండి కోడిపుంజుల వాగు వరకు సింగరేణి సేఫ్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలలో అనేక అవకతవకలు జరిగాయని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోళ్ళ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సేఫ్ ని

ధులతో చేపట్టిన నిర్మాణాలలో అధికార పార్టీకి చెందిన గుత్తేదారికి ఎలా పనులు కేటాయించార ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ వాసుల కోసం చేపట్టిన డ్రైనేజీ నిర్మాణంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి గుడ్ విల్ పేరుతో మరొకరికి డ్రైనేజీ నిర్మాణ పనులను అప్పగించి భారీగా ఆ ప్రజాప్రతినిధి ముడుపులు దండుకున్నారని ఆయన ఆరోపించారు. గుత్తేదారు ధన దాహంతో చేపట్టిన నిర్మాణాలపై జిల్లా అధికారులు కొరడా దులిపించి తక్షణమే డ్రైనేజీలను పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అధికార పార్టీ నాయకుల అక్రమ కాంట్రాక్టు విషయాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.