Telugu News

మణుగూరులో మరో సోను సూద్..

గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పిటిసి గా పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించిన నవీన్ బాబు

0

మణుగూరులో మరో సోను సూద్..

👉మానవత్వమే తన ప్రతిరూపం.
👉 సమాజసేవలో తనకంటూ ఓ పేరు లిఖిస్తున్న యువకుడు
👉 ఆపదలో నేను సైతం అంటూ – ఆపన్న హస్తం
👉 సమాజానికి విద్యాకుసుమాలు అందిస్తు
👉 పినపాకలో మరో సోనుసూద్
👉 పార్టీల చూపు ఆ యువకుడి వైపే
👉 గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పిటిసి గా పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించిన నవీన్ బాబు

(రిపోర్టర్-రాజశేఖర్ రెడ్డి)

బూర్గంపాడు, ఆగస్టు 18(విజయంన్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన నవీన్ బాబు ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నారు. బెంగళూరులో ఇన్ స్ట్రాన్ అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ తన తాత వెంకట నరసింహ రాజు, తండ్రి సోమరాజు పేదలకు చేస్తున్న సేవలకు ఆకర్షితుడై తనకున్న సంపాదనలో అనేకమంది పేదలకు వైద్య,విద్య ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బెంగళూరు నుండి స్వగృహానికి వచ్చిన నవీన్ బాబు ఆపద అంటే నేనున్నానంటూ స్పందించి అనేక మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. సొంత మండలం లోని నిరుపేద విద్యార్థులకు పేదరికం వాళ్ళ తమ చదువులకు ఆటంకం కలగకుండా ప్రతి ఏడాది పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన చాలామంది కూలీలకు ప్రాంతం, కులం, మతం అనే తేడా లేకుండా బాధితులకు తన సొంత ఖర్చులతో సహాయం అందజేశారు. పేద విద్యార్థులు అయినా 12 మందిని దత్తత తీసుకొని వారికి విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు. అంతే కాకుండా మరో 25 మందికి చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తున్నడు.

ఇది కూడ చదవండి : పాడే మోసిన తుమ్మల

ఈ సేవలను గుర్తించిన దిశా ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్నవాళ్లు సహాయం కావాలని ప్రత్యక్షంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా వచ్చిన వార్తలను కూడా స్పందిస్తూ నేనున్నానంటూ మనసున్న మారాజు లాగా స్పందిస్తూ అనాధలకు, నిరుపేదలకు, సహాయం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి మనసున్న మారాజు లాగా కనిపిస్తు, మా నవీన్ బాబే మాకు రియల్ హీరో అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. తన సంపాదనలో 50 శాతం పేద ప్రజలకు వినియోగిస్తు ప్రజల మనిషి గా పేరు పొందరు.

== కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలనేదే తన నైజం :-
మణుగూరు మండలంలోని తోట రాజేష్ చైతన్య దంపతుల కుమార్తె హారిక వర్షిని కి రెండు కిడ్నీలు పాడైపోయే ఆర్థిక పరిస్థితి బాగాలేక హాస్పటల్ లో చికిత్స పొందుతుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వెంటనే 25 వేల ఆర్థిక సహాయం అందజేసారు. భద్రాచలం శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న ప్రిన్స్ ను స్వయంగా కలిసి వారి కుటుంబానికి 25వేల ఆర్థిక సాయం అందజేశారు. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలానికి చెందిన బోడా అజయ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారాని తెలుసుకుని చికిత్స చేసేందుకు దాతలు ముందుకు రావాలని సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పోస్టులకు నవీన్ బాబు స్పందించి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు అందజేశారు. అలాగే 2014 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఆపరేషన్ చేయడానికి 5లక్షల రూపాయలు ఇచ్చారు. పగిడేరు గ్రామంలో రాజేష్ కు వైద్యం నిమిత్తం 60 వేలు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని 12 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని హాస్టల్ లో ఉంచి అన్ని తానే వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఆ 12 మంది పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. కోట్లకు అధిపతి అయిన వారు సాయం చేయాలనే ఆలోచన రాణి కుబేర్ లకు ఉన్న దాంట్లో సహాయం చేయాలని ఆశించిన నవీన్ బాబును ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

== గోదావరి వరది బాధితులకు అండగా :-

ఇటీవల గోదావరి వరద ప్రాంతాలలో పర్యటించి వారు ఎటువంటి కష్టం కలగకుండా వారు పస్తులు ఉండకుండా అన్నదాన కార్యక్రమాలు,మన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందారు.

== యువ నాయకుడి అడుగులు ఎటువైపు..!

పినపాక నియోజకవర్గం లో త్వరలో రాజకీయాలు మారబోతున్నాయా..? పరిస్థితులు చూస్తుంటే అందుకు అనుగుణంగానే కనపడుతున్నట్లు ఉన్నాయి.సామాజిక సేవకర్త, యువ నాయకుడు బుద్ధ రాజు నరసింహారాజు ( నవీన్ బాబు) అడుగులు ఎటు వేయబోతున్నాడు..? అన్న అట్టి విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.. నవీన్ బాబు ప్రజా సేవలో అందరికీ సుపరిచితుడు అత్యంత ఆత్మీయుడు కూడా. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున జడ్పిటిసి గా పోటీ చేసి అధికార పార్టీ నాయకులకు ముచ్చటలు పట్టించారు. అ ఎన్నికలలో నవీన్ బాబు పై అధికార పార్టీ నాయకులు కేవలం అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ యువ నాయకుడికి ప్రజలలో ఎంత ఆదరణ ఉంది అనేది. ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలలో మునిగిపోయారు. ఎవరు ఆపదలో ఉన్న నేను ఉన్న అంటూ సహాయం చేస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రధాన పార్టీ నాయకుల దగ్గర నుండి నవీన్ బాబుకు సీటు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఆ పార్టీలో చేరాలని ఒత్తులు వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో యువ నాయకుడు అడుగులు ఎటు వేస్తాడు అనే అంశం చర్చిన అంశంగా మారింది.