Telugu News

ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్  రేగా

ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

0

ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

★★ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు…
మణుగూరు జులై09 (విజయం న్యూస్)
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయల అంచనా వ్యయంతో  ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ని మరియు సుమారు 42 లక్షల రూపాయలు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు . జిల్లా కలెక్టర్ శ్రీ దూరిశెట్టి అనుదీప్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని.తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు, బస్తీ దవఖానాలలో మెరుగైన సౌకర్యాలు కలిపిస్తుందన్నారు.రాబోయే రోజులలో పినపాక నియోజకవర్గం లో అదనంగా మరిన్ని ఆసుపత్రిల నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లమాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు  ప్రభుత్వం అత్యధిక యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నదని
తెలంగాణను దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్షమని విద్య వైద్య వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన అన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలిచిందని  గొర్రెల పెంపకం, రైతుబంధు, మంచినీటి వసతి హరితహారం, పథకంపై కేంద్రం ప్రశంసలు కురిపించిందని వ్యవసాయ రంగం అన్ని విధాలా అభివృద్ధి చెందినందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారని.
కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్  వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారని, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ దవాఖానాలను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలు జనరల్ వార్డులలో తిరిగారు, బెడ్ల వద్దకు పోయి అందరి తో నేరుగా మాట్లాడారు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు, పేరు వివరాలు అడిగి తెలుసుకుని వారి ప్రత్యేకంగా  వార్డులలోకి కూడా వెళ్లి పేషంట్లతో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇంకా కావాల్సిన సదుపాయాల కోసం మరింత నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పార్టీ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.