Telugu News

రోడ్డు ప్రమాదంలో ఒకే ఇంటికి చెందిన ముగ్గురు మృతి

లారీ, మోటర్ సైకిల్ ఢీ

0
లారీ టైర్ కింద చిన్నారి*   

— తండ్రి, కుమారుడు, కూతురు మృతి                                            

—  అతివేగమే  ప్రమాదానికి కారణం : ప్రజల ఆరోపణ                
(మణుగూరు రూరల్ – విజయం న్యూస్)   
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడు గుంట వద్దగల భద్రాద్రి పవర్ ప్లాంట్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలోఒకే ఇంటికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,  ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఈ ప్రమాదంలో మృతి చెందిన అంబోజు కృష్ణ అనే వ్యక్తి మణుగూరులో ఆర్.ఎం.పి డాక్టర్ గా పని చేస్తున్నాడు. శనివారం మంగపేట నుండి మణుగూరు వస్తుండగా చిక్కుడు గుంట వద్ద అతి వేగంగా వస్తున్న  బొగ్గు లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి  వెనక నుండి ఢీ కొట్టింది. ఈ క్రమంలో అంబోజు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు లారీ వెనుక టైర్ల కింద పడిపోయారు. అంబోజు అమల్ ప్రీతం(7) అక్కడికక్కడే మృతి చెందాడు.  అంబోజు  జాహ్నవి(10) కి  తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారులు టైర్ల కింద పడ్డ విషయాన్ని గమనించని లారీ డ్రైవర్ సుమారు ఒక కిలోమీటర్ వరకు బాబును ఈడ్చి కొని  వెళ్లాడని స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఏ.ఎస్.ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇద్దరు చిన్నారులు మృతజీవులు గా రోడ్డు మీద పడి ఉంటే కూడా ఏ వాహనం ఆపలేదని స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో వస్తున్న   ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వెంటనే తన వాహనాన్ని ఆపి విగతజీవులుగా ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే పాపను పోలీసు వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప కూడా మరణించింది. వీటన్నిటికీ లారీల అతివేగమే కారణమని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, లారీ యజమానులు పట్టించుకోవడంలేదని ప్రజలు  ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి అతి వేగంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకొని, ప్రమాదాల బారి నుండి కాపాడాలని వారు  కోరుకుంటున్నారు. అనంతరం మణుగూరు సిఐ ఆర్ భాను ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’