Telugu News

 ఇల్లందులో పలు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

ఇద్దరు వార్డు మెంబర్ల తో సహా 165 కుటుంబాలు కాంగ్రెస్ గూటికి

0

 ఇల్లందులో పలు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

== ఇద్దరు వార్డు మెంబర్ల తో సహా 165 కుటుంబాలు కాంగ్రెస్ గూటికి

== కాంగ్రెస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం: కోరం

(ఇల్లెందువిజయం న్యూస్):

 కాంగ్రెస్ పార్టీతోనే ప్రతీ పేదవానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని బావించి మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు  అధ్యక్షతన ఇల్లందు మండలం,పూబెల్లి,దండగుండాల,గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరారు .జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. పూబెల్లి గ్రామ పంచాయతీకి చెందిన165 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి.కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు మాట్లాడుతూ

ఇది కూడా చదవండి: కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకు లాభం చేకూరుతుందే తప్ప చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.నిజంగా రైతు మెలుకోరుకునే ప్రభుత్వమే అయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర,విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు.మారుమూల ప్రాంతాల్లో నివసించే మాలాంటి వారికి కనీస అవసరాలైన విద్యా,వైద్యం లాంటివి కూడా అందని ద్రాక్షగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు మాత్రం హామీలు ఇవ్వడంలో గొప్ప,ఆచరణలో మాత్రం దిబ్బ అని ఎద్దేవా చేశారు.గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ,అనునిత్యం అందుబాటులో ఉండే కోరం కనకయ్య  వెంట ఇకపై తమ ప్రయాణం అంటూ,రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇల్లందు నియోజకవర్గంలో బారీ మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ .అనసూర్య,

ఇది కూడా చదవండి: రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియెలు,మండల ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్,సర్పంచులు కల్తీ పద్మ, పాయం స్వాతి,తాటి చుక్కమ్మ,పాయం లలిత,ఎంపీటీసీ మండల రాము,పూనెం సురేందర్,పాయం కృష్ణప్రసాద్,మాజీ ఎంపీపీ వెంకటమ్మ,వార్డు మెంబర్లు మచ్చ సమ్మక్క,చీమల బక్కయ్య, కల్తీ రాంబాబు,మహిళా నాయకురాలు బానోత్ శారద, కాంగ్రెస్ పార్టీ నేతలు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస రావు,కోరం సురేందర్,ఐలయ్య,నెల్లూరి సైదులు,తాటి బిక్షం, ముక్తి కృష్ణ, కాకటి భార్గవ్,ఆముదాల ప్రసాద్, రావూరి సతీష్,ప్రసన్న కుమార్ యాదవ్,బక్కతట్ల వెంకన్న,పాయం ఆంజనేయులు,యువజన నాయకుడు శ్రీకాంత్,గ్రామ పెద్దలు మచ్చ లక్ష్మి నారాయణ,కల్తీ స్వామి,ఈసం భాస్కర్,చీమల శివ,చీమల కృష్ణమూర్తి, మాడే జగ్గయ్య,చీమల పొట్టెయ్య,తదితరులు పాల్గొన్నారు..