Telugu News

కూసుమంచి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి పొంగులేటి

కూసుమంచి-విజయంన్యూస్

0

కూసుమంచి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి పొంగులేటి
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా నాయకన్ గూడెం లో ఇటీవల దేశ బోయిన సైదులు చనిపోగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. పాలేరులో నిమ్మల రామయ్య ఇటీవల చనిపోగా అతని కుటుంబాన్ని పరామర్శించారు.

also read :-సుడా చైర్మన్ పై అసత్య ఆరోపణలు తగదు

అలాగే పాలేరులో దాసరి బాలకృష్ణ తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గురవాయి గూడెం లో రమేష్ రెడ్డి తల్లి ఇటీవల చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కూసుమంచి మండల నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, బి.సుధాకర్ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి , బారీ వీరభద్రం, ముదిరెడ్డి కేశవ రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షుడు బానోతు రాంకుమార్, మాజీ ఎంపీపీ యడవల్లి ముత్తయ్య, దేవర అమల, వెంకన్న, ఏడుకొండలు, నరేష్, జనార్ధన్ తదితరులు ఉన్నారు.