కేశ్వాపురంకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక
== సీపీఎం, బీఆర్ఎస్ నుంచి 75 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక
*- పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి*
(తిరుమలాయపాలెం/కూసుమంచి -విజయం న్యూస్)
తిరుమలయపాలెం మండలం కే శవాపురం గ్రామానికి చెందిన 50 సిపిఎం కుటుంబాల వారు కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ ఆధ్వర్యంలో..జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో మంగళవారం హస్తం గూటికి చేరారు.
ఇది కూడా చదవండి:- “చంద్రబాబు” నేడే విడుదల
సాయి గణేష్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పొంగులేటి శీనన్న అందరికీ అందుబాటులో ఉంటారని, అండగా నిలుస్తారని తెలిపారు. సిపిఎం నుంచి కాంగ్రెస్లో చేరిన వారిలో బెజ్జబోయిన రాంబాబు, పెంకటి నర్సయ్య, రమేష్, ఉప్పయ్య, ప్రేమ్, పవన్, శ్రావణ్ కుమార్, సాయి కుమార్, శ్రీను, జమ్ముల రమేష్, సాయి చంద్, బొందయ్య, ముత్తయ్య, మల్సూరు, తోట వెంకన్న, శోభన్, అశోక్, నరేందర్ తదితరులు ఉన్నారు.
== బోడియా తండా నుంచి..:*
కూసుమంచి మండలం బోడియా తండాకు చెందిన 25 మంది
బీఆర్ఎస్ నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. భూక్య వెంకన్న నాయక్, బోడ వీరూ, బాధావత్ సునీల్, భూక్య నామా ఆధ్వర్యంలో వార్డు సభ్యులు బాదావత్ చిన్ని హరియా, బోడ మురళి, అచ్చమ్మ సేవియా, నాయకులు బాదావత్ నాను, భూక్య బాలాజీ, హుస్సేన్, వెంకన్న, బానోత్ బానియా తదితరులు చేరారు.
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.