Telugu News

ముజ్జుగూడెంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక

పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

0

ముజ్జుగూడెంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక

== పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

(నేలకొండపల్లి-విజయం న్యూస్)

మండలంలోని ముజ్జుగూడెం గ్రామానికి చెందిన 25 బీఆర్ఎస్ కుటుంబాల వారు సీనియర్ నాయకులు వేగినాటి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో అంతా హస్తం గుర్తుపై ఓటేయాలని కోరారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో గంధం నాగరాజు, సీమ విజయ్, సీమ బాబు, భాస్కర్, మోకాలు రాములు, యాతాకుల రాజా, శ్రీనివాసరావు, నారాయణ, గోవిందు, నాగేంద్ర తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలి కూర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.