ఎంతో మంది రాజకీయ గొంతుకోసిన వ్యక్తి తుమ్మల: మంత్రి
== కేవలం రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నాడు
== ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నగరం 53వ డివిజన్ స్వర్గీయ బుడెన్ బేగ్ కుమారుడు ప్రముఖ వైద్యులు నియాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంప్ లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఇది కూడా చదవండి:-ఇల్లందులో ఆ పార్టీ విజయం తథ్యం: జోస్యం చెప్పిన ఎంపీ
బేగ్ ను పావుగా వాడుకుని రాజకీయ హత్య చేసిన ఘనుడు తుమ్మల.
బేగ్ రాజకీయ జీవితం చిద్ర్యం చేసిన గోముఖ వ్యాగ్రం తుమ్మల.
తుమ్మల స్వార్ధం కోసం ఎంతో మంది రాజకీయ గొంతుకోసిన వ్యక్తి తుమ్మల.
రాజకీయంలో తను ఎదుగుతే చాలు అన్నా స్వార్థం తప్ప వేరే ఏ అవకాశం ఇకొకరికి ఇవ్వలేదు.
గడచిన 9ఏళ్లలో ఇక్కడ నేను చేసిన అభివృద్దిని కూడా అతనే చేసినట్టు చెప్పుకునే వ్యక్తి ఇక్కడ ఉండటం విచారకరం.
కేవలం రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నాడు తప్ప ప్రజలపై ప్రేమతో కాదు అని ఇప్పటికైనా ప్రజలు అర్దం చేసుకోవాలి.
ఇది కూడా చదవండి:-అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి
కార్యక్రమంలో కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య నాగరాజు, DCCB చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ మగ్బూల్, జహీర్ ఆలీ, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, షౌకత్ అలీ, తాజ్ ఉద్దీన్, బిచ్చాల తిరుమల రావు, మద్దినేని వెంకటరమణ, డొకుపర్తి సుబ్బరావు, జగ్గారావు, సలీం, జహీర్ అలీ, చంద్రకని శ్రీనివాస్, రవి, మురళీ, వీరబాబు, లక్ష్మణ, అబ్బాస్ తదితరులు ఉన్నారు.