Telugu News

ములుగు జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం..

నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

0

ములుగు జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం..

== నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

ములుగు/నూగూరు వెంకటాపురం/జూన్1(విజయమ్ న్యూస్):

మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాగితోజు శివ ప్రసాద్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ, రహదారి నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలను ధ్వంసం చేయాలనే నెపంతో వాజేడు మండలం, గుమ్మడిదొడ్డి గ్రామ శివారులోని వంతెన వద్ద బుధవారం రాత్రి సమావేశమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి సిఐ శివప్రసాద్, వాజేడు ఎస్సై రేక అశోక్, సిఆర్పిఎఫ్ బలగాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా గమనించిన ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు.

ఇది కూడా చదవండి: పుష్ప తరహాలో టేకు కలప స్మగ్లింగ్

వారిని వెంటాడి పట్టుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనంపై ఒక బస్తా సంచిలో పేలుడు పదార్థాలు, పెట్రోలుతో ఉన్న పుల్లూరి నాగరాజు,వావిలాల నర్సింగరావు, ఏంపల్లి జాషువ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా వెంకటాపురం, వాజేడు మండలాల మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకు సహకరించిన గుమ్మడిదొడ్డి బంక్ యజమాని కంబళ్లపల్లి గణపతి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంకు యజమాని వద్ద పది లీటర్ల పెట్రోలు,5000 రూపాయల తీసుకొని రోడ్డు పనులు జరుగుతున్న వాహనాలను తగలబెట్టడానికి వెళుతున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు.
నిందితులతో పాటు మావోయిస్టులకు సహకరించిన బంకు యజమానిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తునట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ వారి స్వార్థ ప్రయోజ నాల కోసం మాత్రమే పాటుపడుతుందని ప్రజలు మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని వారితో కలిసి నేరాలకు పాల్పడి ఏజెన్సీ యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సీఐ శివప్రసాద్ తెలిపారు.

కొరియర్ల వద్ద లభ్యమైన పేలుడు పదార్థాలు:

కార్డెక్స్ వైర్ 5 మీటర్లు, ఒక డిటోనేటర్, 3 సెల్ ఫోన్లు, ఒక అగ్గిపెట్టె, ఎలక్ట్రిక్ వైర్ 10 మీటర్లు,ఒక మోటార్ సైకిల్, ఒక టిఫిన్ బాక్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి