మావోయిస్టు పార్టీ ఆరాచకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఓఎస్డీ
గిరిజనులకు చైతన్యం కల్పించిన ఓఎస్డీ టి.సాయి మనోహర్
మావోయిస్టు పార్టీ ఆరాచకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఓఎస్డీ
== గిరిజనులకు చైతన్యం కల్పించిన ఓఎస్డీ టి.సాయి మనోహర్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30(విజయంన్యూస్):
మావోయిస్టు పార్టీ అరాచకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గిరిజన బిడ్డలంతా చైతన్యం కల్గి ఉండాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆపరేషన్ వింగ్ అడిషనల్ ఎస్పీ టి.సాయి మనోహర్ కోరారు. దుమ్ముగూడెం పోలీస్ జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అరాచకాలపై మండలంలోని ములకనపల్లి గ్రామంలో చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ లు ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఓఎస్డీ టి.సాయి మనోహర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.మావోయిస్టు నాయకుల వలన గానీ,మావోయిస్టు పార్టీ వలన గానీ ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని అన్నారు.పైగా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని అడ్డుకుని ఆదీవాసి ప్రజల ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని తెలియజేసారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మావోయిస్టు పార్టీకి ఏ ఒక్కరూ సహకరించకూడదని కోరారు. అనంతరం భద్రాచలం ఏఎస్పీ మాట్లాడుతూ తమ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు వాలీబాల్ కిట్లు,క్యారం బోర్డులు మరియ ఇతర క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది.అనంతరం గ్రామస్తులందరితో కలిసి పోలీస్ అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన సహపంక్తి విందులో పాల్గోన్నారు.ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిఎస్పీ రేవతి,దుమ్ముగూడెం సిఐ రమేష్ ఎస్సైలు రవి,కేశవ సిబ్బంది పాల్గోన్నారు.
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టుల ఘాతకం