Telugu News

ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టుల ఘాతకం

ఎల్ఈడీ పెల్చడంతో.. అక్కడిక్కడే 10మంది జవాన్లు..ఒక డ్రైవర్ మృతి..

0

*ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టుల ఘాతకం

== ఐఈడీ పెల్చడంతో.. అక్కడిక్కడే 10మంది జవాన్లు..ఒక డ్రైవర్ మృతి..

== దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన భూపేశ్ భగేల్‌

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

తెలంగాణ పక్క రాష్ట్రం చత్తీస్ గడ్ లో మావోయిస్టులు జవాన్లపై ఘాతుకానికి పాల్పడ్డారు. బస్తర్ జిల్లాలో బస్సులో పర్యటిస్తున్న జవాన్లపై మావోయిస్టులు ఐఈడీ బాంబులతో ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో అక్కడిక్కడే 11మంది మృతి చెందినట్లు బస్తర్ జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి : రేణుకచౌదరి దమ్ముంటే నాపై పోటీ చేయ్: పువ్వాడ 

ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు.

దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

ఇది కూడా చదవండి:- ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి

మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ఐజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్‌ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈలోపే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

*_ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి_*
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇది కూడా చదవండి:- వైఎస్ షర్మిళ కు బెయిల్ మంజూరు

దాడికి పాల్పడిన నక్సల్స్‌ ను ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు, ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి భగేల్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.