Telugu News

మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు…..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు..

0

==మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు…..
==భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు..

==(భద్రాచలం- చండ్రుగొండ విజయం న్యూస్ ): –

చింత గుప్ప వాగుపై పై జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వద్దకు మంగళవారం సాయంత్రం సమయంలో వచ్చిన మావోయిస్టులు వంతెన పనులకు కాంట్రాక్టర్ ఉపయోగిస్తున్న పలు వాహనాలను తగులబెట్టారు. ఆ సమయంలో అక్కడున్న వారిని గట్టిగా అరుస్తూ వాళ్లను మందల ఇచ్చినట్లుగా తెలుస్తోంది …

also read :-త్వరలో బహదూర్ పల్లి, తొర్రూర్ లే అవుట్లలో ప్లాట్ల వేలం

ఈ సంఘటనలో నాలుగు ట్రాక్టర్లు, ఒక హైజాక్ ని మావోయిస్టులు దగ్ధం చేసినట్లు సమాచారం.. కాగా భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.. సుమారు 50 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటన కి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

కొంతకాలంగా ఎటువంటి అలజడి చోటు లేకుండా భద్రతా బలగాల రక్షణ చర్యల నడుమ ప్రశాంతంగా కాలం గడుపుతున్న మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ప్రజలకు మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు…..చింత గుప్ప దగ్గర వాహనాల దగ్ధం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఒకవైపు కూంబింగ్ మరోవైపు వాహన తనిఖీలు చేపట్టారు… ఏమవుతుందో అనే భయంతో అటవీ గ్రామాల ఆదివాసులు బిక్కుబిక్కుమంటున్నారు….