Telugu News

సమ్మెకు మావోయిస్టుల మద్దతు.

** ఉత్కంఠ పరిస్థితి.. 

0

సమ్మెకు మావోయిస్టుల మద్దతు
** ఉత్కంఠ పరిస్థితి.. 
(మంచిర్యాల-విజయం న్యూస్)
సింగరేణి సమ్మెకు  మావోస్టులు మద్దతు ప్రకటించారు. న్యాయమైన పద్దతిలో సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నారు.. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో చేపడుతున్న సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సంపూర్ణమద్దతు ప్రకటించింది. ఆ పార్టీ సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ బుధవారం మంచిర్యాల ఆంధ్రజ్యోతి కార్యాలయా నికి పంపిన లేఖలో 72గంటల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పేర్కొన్నారు. గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ సమ్మెకు మద్దతు నివ్వడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందగా ఉందన్నారు. గతంలో మంద మర్రి ఓపెన్కాస్టుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తానని చెప్పిన మంత్రి హరీష్ రావు ఆ తర్వాత అన్నీ మరిచిపోయారన్నారు. టీబీజీకేఎస్ నేతలు కపట ప్రేమతో జిమ్మిక్కులు చేస్తున్నారని పేర్కొన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తూ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. టీబీజీకేఎస్ నాయకులు పదవులకు రాజీనామా చేసి కార్మికులపక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకుల కారణంగా బెల్లంపల్లి అన్వేషణ విభాగం కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. అందుకు కారణమైన కార్మికద్రోహుల పేర్లను త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు కోల్బెల్ట్ కమిటీ అండగా ఉంటుందని, కార్మిక ద్రోహులకు ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని ప్రభాత్ తన లేఖలో పేర్కొన్నారు.

also read ;- తెలంగాణ నుంచి ఏపీ వస్తున్న ఆటోలను ఆపి చెక్ చేస్తే…పోలీసులకే మతిపోయేలా చేశారు!