Telugu News

త‌ల్లిదండ్రులు పెళ్లి చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నార‌ని పోలీసుల‌కు మ‌రుగుజ్జు యువ‌కుడి ఫిర్యాదు

0

త‌ల్లిదండ్రులు పెళ్లి చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నార‌ని పోలీసుల‌కు మ‌రుగుజ్జు యువ‌కుడి ఫిర్యాదు

. (ఉత్తరప్రదేశ్ విజయం న్యూస్):-

అత‌డి పేరు అజీమ్ మన్సూరీ… వ‌య‌సు 26. మూడు అడుగుల రెండు అంగుళాల‌ పొడవు మాత్ర‌మే ఉంటాడు. మ‌రుగుజ్జు కావ‌డంతో త‌నకు పెళ్లి కావ‌ట్లేద‌ని, పిల్ల దొర‌క‌ట్లేద‌ని గ‌తంలో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి, మీడియా ముందుకు వ‌చ్చి దేశ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచాడు. త‌న పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ యువ‌కుడికి మ‌రో క‌ష్టం వ‌చ్చింది.

త‌న‌కు పిల్ల దొరికింద‌ని.. అయితే, త‌న త‌ల్లిదండ్రులు పెళ్లి చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నార‌ని అంటున్నాడు. అంతేకాదు, ఈ విష‌యంపై త‌న త‌ల్లిదండ్రుల మీద పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అజీమ్ మన్సూరీ తాజాగా శామ్లీ స్టేషన్ ఇన్‌ఛార్జికి ఈ మేర‌కు ఫిర్యాదు చేశాడు.

also read :-తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

హాపుఢ్ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో త‌న‌కు గ‌త ఏడాది పెళ్లి నిశ్చయమైనప్ప‌టికీ తల్లిదండ్రులు పెళ్లి చేయ‌ట్లేద‌ని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఘ‌నంగా వివాహం చేస్తామ‌ని ఇప్ప‌టికీ చెబుతున్నార‌ని తెలిపాడు. అయితే, అంతవరకు వేచి ఉండే ఓపిక త‌నకు లేదని పోలీసుల‌కు అజీమ్ మన్సూరీ చెప్పాడు.

అత‌డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివాహం విషయమై అతడి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. కాగా, ఘజియాబాద్ కు చెందిన రెహానా అనే రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న రెహానాకు గ‌త ఏడాది అజీమ్ తో పెళ్లి నిశ్చ‌య‌మైంది.