Telugu News

యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ లు ప్రారంభించాలి: పువ్వాళ్ల

నేటికీ పంట నష్టపరిహారం అందలేదు

0

యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ లు ప్రారంభించాలి: కాంగ్రెస్ నేత

👉🏻 నేటికీ పంట నష్టపరిహారం అందలేదు

👉🏻జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టోయి ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించడానికి జాప్యం ఏంటి అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల

అంతే కాకుండా వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పంట నష్ట సర్వేలో అవకతవకలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారని ప్రభుత్వం పకడ్బందీగా సర్వే నిర్వహించి అసలైన రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.రైతన్నలకు దిగుబడి రాక,అకాల వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్న రైతులు క్వింటాలుకు 400రూపాయల నుండి 500 రూపాయల రేటు తేడాతో ప్రవేటు వ్యాపారులకు అమ్మారని కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయక పోతే రైతులు నష్టపోతారని,ఆలస్యం అయిన కొద్ది దలారులకు మేలు చేకూర్చట మేనని త్కక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.