Telugu News

మాస్క్ లేదా.. పైన్ కట్టు.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీలు

0

మాస్క్ లేదా.. పైన్ కట్టు.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీలు
(సిద్దిపేట –విజయంన్యూస్)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విసృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించకుండా రహదారిపై వెళ్తున్న పలువురు బాటసారులు, వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధించారు. కరోనా మహమ్మారి మరొకసారి ప్రపంచదేశాలలో, దేశంలో, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ విధిగా ఇంట్లో నుంచి బయటికి జనసమ్మర్ధ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్కూలు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ఎస్సై శ్రీధర్ సూచించారు.

also read ;-సమితి సభ్యుల సేవలు శ్లాఘ‌నీయం…

కరోనా నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ లను ఉపయోగించి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకుంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్సై శ్రీధర్ పేర్కొన్నారు.