Telugu News

ఐకమత్యానికి ప్రతీక సాముహిక వనభోజనాలు : మాజీ ఎంపీ పొంగులేటి

రామాలయ అభివృద్ధికి పొంగులేటి రూ.లక్ష విరాళం

0

ఐకమత్యానికి ప్రతీక సాముహిక వనభోజనాలు : మాజీ ఎంపీ పొంగులేటి
రామాలయ అభివృద్ధికి పొంగులేటి రూ.లక్ష విరాళం
పలు శుభకార్యాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఆదివారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని బోనకల్, ఖమ్మం పట్టణం, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, చింతకాని మండలాల్లో పర్యటించారు.

బోనకల్ : ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అలనాటి రోజులను గుర్తుచేసుకొనే విధంగా గ్రామ ప్రజలు అందరూ కలసి కులమతాలకు అతీతంగా సాముహిక వనభోజనాలు నిర్వహించుకోవటం గొప్ప విషయమని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా రామాపురం గ్రామంలోని రామాలయంలో మాజీ ఎంపీ పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు, గుడి చైర్మన్ పొంగులేటికి తీర్ధప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రామాలయం అభివృద్ధిలో భాగంగా తన వంతు సహాయంగా రూ.లక్ష రూపాలయను పొంగులేటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను, వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు అభివాదం చేస్తూ వారిని పలుకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ తొండపు వేణు, రామాపురం గ్రామ ప్రజలను, నిర్వాహకులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, రామాలయ చైర్మన్ బంధం అచ్చయ్య, బోనకల్ సర్పంచ్ భుక్యా సైదులు నాయక్, ఉమ్మినేని కృష్ణ, చిన్న బీరవెల్లి పేరుశాంతయ్య, కిరణ్, సాధినేని రాంబాబు, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, నల్లిబోయిన కృష్ణ, బీరెల్లి వాసు, గొగినేని ప్రదీప్, చిట్టిమొదు శ్రీను, గాదె నరోత్తమ రెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, గడిపుడి రామకృష్ణ, బంధం కృష్ణ, దిద్దుబోయిన నాగయ్య, నల్లమోతు సత్యనారాయణ, గుడిపుడి వెంకటేశ్వర్లు, ఇరుగు నాగభూషణం, మామిళ్ల కృష్ణయ్య,జవ్వాజి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పట్టణంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం : ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం పట్టణంలో పర్యటించారు. కార్తీకమాసం సందర్భంగా జలాంజనేయస్వామి దేవస్థానంలో చైర్మన్ చిన్ని రాజ్ కుమార్, కార్పోరేటర్ శ్రావణి-సుధాకర్ దంపతులు, పారా శ్రీను, సంపత్ కుమార్ ఏర్పాటు చేసిన కుంకుమపూజ, అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంజాల వెంకటేశ్వర్లు మనుమడు, మనుమరాళ్ల పంచకట్టు, ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. బొందిలి సత్యనారాయణ సింగ్ కుమార్తె వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తెను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. తమ్మిశెట్టి పరశురామ్ పిల్లల పంచెకట్టు, ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మలీదు వెంకటేశ్వర్లు తల్లి వరమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి, నాయకులు కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, అనంతరెడ్డి, చెల్లా రామకృష్ణారెడ్డి, దారావత్ రాంబాబు, కనగంటి రావు, దుంపల రవి కుమార్, చింతమళ్ల గురుమూర్తి, కొనకంచి మోషే, సైదులు గౌడ్, మరికంటి కృష్ణ, ప్రసాద్, రఫీ, యువనేత గోపి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
కొణిజర్ల : ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో పర్యటించారు. గుండ్ల రామారావు కుమారుని వివాహం వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. షేక్ జానిమియా ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొని చిన్నారులను దీవించారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, నాయకులు కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, దారావత్ రాంబాబు, కనగంటి రావు, కొనకంచి మోషే, ఏలూరి శ్రీను, అద్దంకి చిరంజీవి, వెంకటప్పయ్య, షేక్ జానిమియా, రామకోటయ్య, నరేందర్, బాబులాల్, దేవేందర్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు పొంగులేటి దంపతుల ఆశీర్వాదం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎం ఆర్ గార్డెన్స్ లో దొడ్డా శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మాజీ జడ పీటీసీ బత్తుల అంజి, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వర్ రావు, మందపాటి ముత్తా రెడ్డి, దొడ్డా శ్రీను, కోటగిరి సుధాకర్ బాబు, మలిరెడ్డి మురళి రెడ్డి, కర్లపూడి రామారావు, తుంబూరు శ్రీను, కిష్టపురం రాజా, ఇమ్మినేని ప్రసాద్ రావు, మానస నాని, టెక్స్మో కృష్ణారెడ్డి, కమల్ పాషా, సంజీవ్ రెడ్డి, అనిల్, అట్లూరి సత్యనారాయణ రెడ్డి, కొప్పుల ప్రసాద్ రెడ్డి, మహేష్, భరత్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెల్లబోయిన నాగేశ్వరరావు కుటుంబానికి పొంగులేటి పరామర్శ
తల్లాడ : అంజనాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన రాఘవులు కుమారుడు నాగేశ్వరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, సర్పంచ్ కొమ్మినేని విద్యాసాగర్ రావు, టీఆర్ఎస్ నాయకులు గణేషుల రవి, పొట్టేటి బ్రహ్మారెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

also read ;-మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి కి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంతాపం