Telugu News

కూసుమంచి మండలంలో కాంగ్రెస్ గూటికి వందల మంది

కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి 

0

కూసుమంచి మండలంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు

== వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ వీరారెడ్డి ఆధ్వర్యంలో నాయకన్ గూడెం, అజ్మీరా తండా, హర్మాన్ తండా, గోరీలపాడు నుంచి హస్తం గూటికి..

== కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి 

(కూసుమంచి-విజయం న్యూస్):

 

మండలంలోని నాయకన్ గూడెం నుంచి కంచర్ల వీరారెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు మంగళవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇంకా అజ్మీర తండా, హర్మాన్ తండా, గోరిలపాడు నుంచి పలువురు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వo అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అన్ని వర్గాల వారికి లబ్ధి కలుగుతుందని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని అభయమించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా శ్రమించి.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*పార్టీ లో చేరిన వారిలో..:* మాజీ సర్పంచ్ రాములు,మాజీ రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు మండవ వీరా నాగుల్, , మాజీ వార్డు సభ్యులు దానబోయిన నాగేశ్వరరావు,దానబోయిన శీను, బుర్రి యలమంచి,ఎండి అక్బర్ షరీఫ్, సావిత్రమ్మ తదితరులు ఉన్నారు.
*ఈ కార్యక్రమంలో..* మాజీ ఎంపీటీసీ లు లింగారెడ్డి,సింగం దామోదర్, జహంగీర్ షరీఫ్, కాంగ్రెస్ నాయకులు మారోజు భీష్మ చారీ,గొల్లపూడి వీరన్న, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కంచర్ల సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.