Telugu News

పొంగులేటి సమక్షంలో భారీగా చేరికలు

నాచేపల్లి, కట్టు కాచారం, రాజేశ్వరపురం గ్రామాల నుంచి హస్తం గూటికి..

0

పొంగులేటి సమక్షంలో భారీగా చేరికలు

– నాచేపల్లి, కట్టు కాచారం, రాజేశ్వరపురం గ్రామాల నుంచి హస్తం గూటికి..

(నేలకొండపల్లి-విజయం న్యూస్):

మండలంలో బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ విధానాలు, నాయకత్వం తీరు నచ్చక పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. సోమవారం రాజేశ్వరపురం నుంచి దండా పుల్లయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, నాచేపల్లి నుంచి బోయపాటి రాంబాబు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, కట్టు కాచారం నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పాలన నచ్చి.. స్వచ్ఛందంగా అనేకమంది తరలివస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని అభయమించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా శ్రమించి.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*పార్టీ లో చేరిన వారిలో..:* మాజీ సొసైటీ చైర్మన్ పచ్చ తిరుపతయ్య, డైరెక్టర్ మందడి వెంకట రామారావు, మాజీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, బాధ్యులు దొండ కొండలు, నాయకులు తీగలపల్లి వెంకటేశ్వర్లు, నరసింహారావు, సైదా బాబు, గోగుల శేఖర్ తదితరులు ఉన్నారు.
*ఈ కార్యక్రమంలో..* రామ సహాయం నరేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.