డాక్టర్ మట్టా దయానంద్ కి గుండె పోటు
** హైదరాబాద్ కు తరలింపు
(సత్తుపల్లి -విజయం న్యూస్)
సత్తుపల్లి బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేత, సీనియర్ నాయకులు మట్టా దయానంద్ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. శనివారం పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో ఉదయం 10 గంటలకు వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మట్టా దయానంద్ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలి కింద పడిపోయాడు.
ఇది కూడా చదవండి:- 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి
దీంతో హుటాహుటిన సత్తుపల్లిలోని జూపల్లి సీతారామయ్య హాస్పటల్ కు తరలించగా, అక్కడి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తరలించారు.ప్రస్తుతం డాక్టర్ మట్టా దయానంద్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మట్టా అభిమానులు,నాయకులు,కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదని కోరుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.