కాంగ్రెస్ గూటికి మట్టా దయానంద్
== నేడు గాంధీభవన్ లో రేవంత్ సమక్షంలో జాయినింగ్
== భారీ ర్యాలీగా గాంధీభవన్ కు దయానంద్ టీమ్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నాయకులు మట్టా దయానంద్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.. ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు తెలుస్తోంది.. భారీ ర్యాలీతో గాంధీభవన్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ కానున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సత్తుపల్లి లో మట్టా దయానంద్ పోటీ చేయగా, స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓటమిపాలైయ్యారు. ఆ తరువాత అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టిఆర్ఎస్ పార్టీలోకి ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరారు.
ఇది కూడా చదవండి: నాడు వైఎస్.. నేడు భట్టి..ఓ సంఘటన..?
అనంతరం 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటించిన మట్టా దయానంద్ బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ ప్లెక్సీలను తొలగించారు. జనవరి 1, 2023న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి హాజరైన మట్టా దయానంద్ ఆ తరువాత పొంగులేటి బీజేపీలో చేరతారనే సంకేతాలు రావడంతో మట్టా దయానంద్ పొంగులేటికి దూరమైయ్యారు. ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడంతో మట్టా దయానంద్, పొంగులేటికి దూరమైయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలో హాజరు కాలేదు. అయితే గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత నిస్తున్న మట్టా దయానంద్ చివరికి మే నెలలో తమ అభిమానులకు, కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి గాంధీభవన్ కు బయలుదేరిన మట్టా దయానంద్ మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే భారీ కన్వాయితో హైదరాబాద్ కు బయలు దేరిన మట్టా దయానంద్, ముందుగా సత్తుపల్లిలో భారీ ర్యాలీ తీశారు.
ఇది కూడా చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీది: తమ్మినేని