ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలి: నామా
ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నామా
ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలి: నామా
== ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నామా
== ఆలయ మర్యాదలతో నామకు స్వాగతం
ఖమ్మం, జూన్ 21(విజయంన్యూస్):
ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని, పాడి పంటలు భాగా పండాలని, ప్రజలందరు సంతోషంగా ఉండే విధంగా దేవదేవుళ్లు చల్లగా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు ఆకాక్షించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జరుగుతున్న తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఆధ్యాత్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూసుమంచి లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలోను, జీళ్ళచెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోను, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నామ పాల్గొని, దైవ ఆశీర్వాదం పొందారు. రుద్రాభిషేకం, వేదపారాయణం, మంత్ర పుష్పము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మార్యదలతో నామకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ నామ తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతోను, సిరి సంపదలతో తులతూగాలని దైవాలను వేడుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని నామ ఆకాక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ దైవం అండగా ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, స్థానిక పార్టీ నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
allso read- కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకం: మంత్రి