Telugu News

తాడ్వాయి మండలం లో ఘనంగా మే “డే” వేడుకలు

గజ్జెల. రాజశేఖర్ ... తాడ్వాయి- విజయం న్యూస్)

0

తాడ్వాయి మండలం లో ఘనంగా మే “డే” వేడుకలు

(గజ్జెల. రాజశేఖర్ … తాడ్వాయి- విజయం న్యూస్):-

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఊరూరా సీఐటీయూ ఆధ్వర్యంలో కామ్రేడ్ దుగ్గి చిరంజీవి, సీఐటీయూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క , సీఐటీయూ జిల్లా నాయకురాలు జమునారాని, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి చిన్న నర్సయ్య గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చిట్టినేని శ్రీనివాసు, సీనియర్ జిల్లా నాయకులు చింతల రఘుపతి, దాసరి కృష్ణ, కాటాపుర్, తాడ్వాయి మండలం కేంద్రం లో మండల పలు గ్రామాలలో ఎర్ర జెండాలను ఎగురవేసి ఘనంగా మే డే వేడుకలు జరుపుకున్నారు.

also read :-కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ

అనంతరం వారు మాట్లాడుతూ .. ప్రపంచ కార్మికులారా కేక్ ఉంటుంది ఏకం కండి అని పిలుపునిచ్చారు 1886 మే 1న అమెరికా దేశంలో చికాగో నగరంలో లో 8 గంటల పనితనాన్ని చేపట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా అమెరికా ప్రభుత్వం కార్మికులపై పైశాచికంగా నిరసన కార్మికులపై కాల్పులు చేపట్టినట్టు తెలిపారు. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ నాయకులు సిహెచ్ సరిత ,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల సమ్మయ్య గౌడ్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నామని శంకర్ ,కాట నర్సింగరావు, పర్వతాల కృష్ణ , సురబాక సోమరాజు, సత్యనారాయణ, గడ్డం శ్రీధర్, ఆశ యూనియన్ నాయకులు జయసుధ ,వట్టం మంకిడి రామ, తదితరులు పాల్గొన్నారు.