Telugu News

పలు డివిజన్లలో అకస్మీక తనిఖీలు చేసిన మేయర్, కమీషనర్

0

పలు డివిజన్లలో అకస్మీక తనిఖీలు చేసిన మేయర్, కమీషనర్

 

(ఖమ్మం కార్పోరేషన్-విజయం న్యూస్);-

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల 37, 39 డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు.నీరజ కమిషనర్ ఆదర్శ్ సురభి శనివారం ఆకస్మీకంగా తనిఖీలు చేశారు. ఆయా డివిజన్లలో ఉన్న మంచి నీటి, తదితర సమస్యలపై స్పందించారు. 37 వ డివిజన్ పెంటగడ్డ బజార్, అజిజ్ గల్లీలలో పర్యటించి లీకేజీ సమస్యలు, ఎత్తున ప్రాంతం లో ఉన్న ఇళ్లకు నీటి సరఫరా సమస్యల గురించి చర్చించారు. దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుండి వచ్చేనీటి సరఫరా ఖమ్మం 43 వ డివిజన్ జడ్పీ సెంటర్ లో గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లకు పరిశీలించారు. అక్కడ నుండి నగరంలో ఏ ఏ ప్రాంతాలకు సరఫరా చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోనీటి సప్లై చేసే మ్యాప్ పరిశీలించారు.

also read;-ప్రజలకు చేరువగా నాయకులుండాలి

39 వ డివిజన్ మేదర బస్తి, ప్రాంతవాసులకు (రోడ్డు మరమ్మత్తుల వలన డ్యామేజ్ అయిన లైన్స్) మంచినీటి సరఫరా, పంపు కలెక్షన్లు లేని ఇండ్ల లను గుర్తించి వారికి కలెక్షన్లు ఇచ్చి నీటిసరఫరా త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా జరుగు సమయంలో ఇంటి యజమానులు మోటార్లను బిగించుకొని నీటిని మోటార్ల ద్వారా తోడు కుంటున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, వారికి రూ.500 నుండిరూ.1000 వరకు జరిమానా విధించి మోటార్లను తీసివేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు ఉప మేయర్ ఫాతిమా జోహార ముత్తార్, ఈ ఈ రంజిత్, డి ఈ స్వరూప రాణి, ఏ ఈ లు నవ్య జ్యోతి, మిషన్ భగీరథ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు