Telugu News

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: అడిషనల్ డీఎంహెచ్ఓ

అడిషనల్ డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్

0

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: అడిషనల్ డీఎంహెచ్ఓ

– వైద్య సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలి

– అడిషనల్ డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి మే 23 ( విజయం న్యూస్) (రిపోర్టర్- బొగ్గుల శివ నాగిరెడ్డి)

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ సూచించారు. గురువారం చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపి రిజిస్ట్, సిబ్బంది హాజర్ రిజిస్టర్, ఫార్మా స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయం గురించి రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి:- నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏడీఏ బేగం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలు కాచి వడబోసిన నీటిని తాగాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే నీ డ్రైడే గా నిర్వహించి. పాత నీటిని తొలగించి కొత్త నీటిని నింపుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో దోమల సంచరించకుండా ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఖాళీ కొబ్బరి బోండాలు, వాడి పడేసిన టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గిరిజనులు గిరిజన ఇతరు లు ఆర్ఎంపి వైద్యులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నారు. ప్రతి గ్రామంలో ఏఎన్ఎం హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయని జ్వరం వస్తే వెంటనే అక్కడికి వెళ్లాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు మందులు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వ వైద్యులు సూచించిన మందులను వాడుతూ ప్రభుత్వ ఆత్పత్తిలోనే కాన్పులు చేయించుకోవాలన్నారు. ఇలా పరిశుభ్రత పాటించడం వల్ల సీజనల్ వ్యాధులు మన దరికి చేరవన్నారు. వైద్య సిబ్బంది కూడా సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనకం తనూజా, స్టాఫ్ నర్స్ శోభారాణి, ఫార్మసిస్ట్ లక్ష్మి, హెల్త్ సూపర్ వైజర్ ఇమామ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రికార్డ్ ఆపరేటర్ ప్రశాంత్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.