కందాల దొంగ… కేసీఆర్ దొంగన్నర: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తొమ్మిదేళ్లలో చేయలేని అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేస్తారట..!*
కందాల దొంగ… కేసీఆర్ దొంగన్నర: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
== తొమ్మిదేళ్లలో చేయలేని అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేస్తారట..!*
== పాలేరు అభివృద్ది శూన్యం*
== ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉంది*
== దళిత బంధు… బీసీ లోన్ పేర్లతో ప్రజలను మభ్య పెట్టారు*
== రాబోయేది మీరు కోరుకునే ఇందిరమ్మ రాజ్యమే*
== ఖమ్మం రూరల్ మండల ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
(ఖమ్మం రూరల్-విజయం న్యూస్)
ప్రజలకు మాయ మాటలు చెప్పడంలో కందాల దొంగ అని…. కేసీఆర్ దింగన్నర అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, రెడ్డి పల్లి, పల్లేగూడెం, ఎం.వి పాలెం గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇది కూడా చదవండి:- సంక్షేమాన్ని మరిచిన ఈ సర్కారును సాగనంపుదాం: పొంగులేటి
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కోసం పోరాడనని చెప్పుకొని… ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని విమర్శించారు. పాలేరు అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా చేయలేని అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళలు, నిరుద్యోగులు, వృద్దులు, వికలాంగులు అన్ని వర్గాల వారికి ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందన్నారు. మూడో సారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారు. కలలు కలలుగా మిగిలిపోవడం ఖాయం అన్నారు. దళిత బంధు, బీసీ లోన్ల పేర్లతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దినేని బేబీ స్వర్ణ కుమారి,రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.