Telugu News

మేడారం వనదేవతల హుండీ ఆధాయం రూ..46.85 లక్షలు

రోజంతా లెక్కించిన అధికారులు, ఉద్యోగులు

0

మేడారం వనదేవతల హుండీ ఆధాయం రూ..46.85 లక్షలు

== రోజంతా లెక్కించిన అధికారులు, ఉద్యోగులు

(రిపోర్టర్ : రాజశేఖర్)

తాడ్వాయి, సెప్టెంబర్ 04( విజయం న్యూస్):-

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం వనదేవతల ఉండి ల లెక్కింపు తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, దేవదాయ శాఖ ఈవో రాజేంద్రం, కెనరా బ్యాంక్ మేనేజర్ సిబ్బంది, పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో శనివారం హండిలను లెక్కించారు.

allso read- తెలంగాణ మాటల మాంత్రికుడు కెసిఆర్..: కపిలవాయి దిలీఫ్ కుమార్

సమ్మక్క హుండి ఆదాయం రూ.26,16,975, సారలమ్మ హుండీ ఆదాయం రూ.17,93,340, పగిడిద్దరాజు ఆదాయం రూ.1,68,492, గోవిందరాజు ఆదాయం 1,05,783, రూపాయలు రాగ 22 హుండిల మొత్తం ఆదాయం రూ.46,84,590 ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ప్రకటించారు. స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు అధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సివిల్ పోలీసులు పహారా మధ్యలో బారీ బందోబస్తు మధ్య హుండిలను లెక్కించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ సునీల్, పూజారులు కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారి కాక సరయ్య, సిద్దబోయిన అరుణ్, సిద్ధబోయిన మునెందర్, సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు, సిద్ధబోయిన వసంతరావు, పాపారావు, మల్లెల ముత్తయ్య, పెనక బుచ్చి రాములు, రాజేశ్వర్, వ పెనక సురేందర్, ఎండోమెంట్ సూపరింటెండెంట్ క్రాంతి, ఇన్స్ పెక్టర్ అనిల్, రాజేశ్వర్ రావు, మధు, కిషన్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

allso read- బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: తమ్మినేని