Telugu News

. . మేడారంలో ఆకాశ విహారం..!

. . మేడారంలో ఆకాశ విహారం..!

0

. . మేడారంలో ఆకాశ విహారం..!

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం సమీపిస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను ఆకర్షించేందుకు ములుగు జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కొత్తగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ :-దక్షణాఫ్రికాపై ఇండియా తొలిటెస్ట్ విజయం

మేడారం జాతర సమయంలో అన్ని దారులు కిటకిటలాడుతాయి. చుట్టూ అడవి.. మధ్యలో తల్లుల గద్దెలు.. దాదాపు చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జన సంద్రమై ఉంటుంది.. ఇలాంటి దృశ్యాలను విహంగ వీక్షణం చేస్తే ఎంత బాగుంటుందో.. జాతర జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఈ ఆలోచనను నిజం చేసేలా జాతరను విహంగ వీక్షణం కోసం హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ జాయ్‌ రైడ్‌లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీతో చర్చిస్తున్నారు. నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థను ఎంపిక చేసే పనిలో అధికారులున్నట్లు సమాచారం.