Telugu News

ప్రతి ఓటర్ ను కలవాలి: పువ్వాళ్ళ 

కాంగ్రెస్ డిక్లరేషన్ పై ప్రచారం సాగుతోంది

0

ప్రతి ఓటర్ ను కలవాలి: పువ్వాళ్ళ 

== కాంగ్రెస్ డిక్లరేషన్ లపై ప్రచారం చేయాలి

== బీల్ఏలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్    పిసిసి మెంబర్ మొహమ్మద్ జావేద్ విజ్ఞప్తి

==నగర కాంగ్రెస్ ఆద్వర్యంలో బీఎల్ఏలతో సమీక్ష సమావేశం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మండలంలో ప్రతి ఓటర్ ను కలిసి కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లను వివరించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కోరారు.నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్వంలో ఆదివారం రఘునాథపాలెం మండల బూత్ స్థాయి ఏజెంట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ…గ్రామ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లే కీలకమని, ఓటు హక్కు పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఓటర్ నమోదు ప్రక్రియ, కొత్త ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో చుస్కోడం వంటి విషయాలపై ఓటర్ తో చర్చించాలని అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు  కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు  చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… ప్రతి గడపకు కాంగ్రెస్ కార్యాచరణ తీసుకెళ్లాలని సూచించారు. ఓటు హక్కు వినియోగంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.

 ఇది కూడా చదవండి:- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు.  పాల్గొన్నవారు తుల్లురి బ్రహ్మయ్య, మువ్వ విజయ్ బాబు, చోటే బాబా, కరుణాకర్ రెడ్డి, వడ్డే నారాయణ, సత్యం బాబు, రబ్బానీ, ఏలూరు రవి, బూత్ ఏజెంట్స్, గ్రామ అద్యక్షులు, తదితరులు పాల్గొన్నరు.