గాంధీభవన్ లో పోలిటికల్ ఆపైర్స్ కమిటీ భేటీ
హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, రాజకీయ సలహాదారుడు సునిల్
గాంధీభవన్ లో పోలిటికల్ ఆపైర్స్ కమిటీ భేటీ
—హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, రాజకీయ సలహాదారుడు సునిల్
—హాజరుకానీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి
(హైదరాబాద్-విజయం న్యూస్);-
వచ్చే నెల 6న వరంగల్ జిల్లాలో జరిగే రైతు సంఘర్షణ సభకు ముఖ్యఅతిథిగా హాజరువుతన్న మాజీ ఏఐసీసీ రాహుల్ గాంధీ పర్యటనపై కసరత్తు చేసే కార్యక్రమంపై తెలంగాణ కాంగ్రెస్ అఫైర్స్ కమిటీ బాధ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, శ్రీనివాసన్, రాజకీయ సలహాదారుడు సునిల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యనాయకులు హాజరైయ్యారు. అయితే ఈ సమావేశంలో గాంధీ పర్యటన షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ఎలా ఉండాలి. జన సమీకరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
also read :-అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాన్ని విడుదల చేసిన కాల్వపల్లి, అంబేద్కర్ వారసులు…..
అలాగే జనసమీకరణ సమావేశాలను మరికొన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని పీసీసీ నిర్ణయించగా, ఆ పర్యటనకు పీసీసీ సమయాత్తం అవుతుంది. అలాగే ఈ సమావేశానికి ముఖ్యానాయకత్వం మొత్తం హాజరుకావాలని పలువురు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాలేదు. అలాగే సమావేశంలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైరాజర్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పీసీసీ రేవంత్ రెడ్డి స్పందించి పని ఉండటం వల్లనే రాలేకపోయారని, చిన్న అంశంగా పరిగణించాలని, ప్రతిది తప్పుపట్టోద్దని తెల్చి చెప్పినట్లు సమాచారం.